
Adigadigo Paralokamu Nundi Digivache Hosanna Song Lyrics
అదిగదిగో పరలోకము నుండి
దిగివచ్చే వధువు సంఘము
వరుణివలే పరిపూర్ణ సౌందర్యమును ధరించుకున్నది॥2॥
1. అల్ఫా ఓమేఘయైన నాప్రాణప్రియునికి
నిలువెల్ల నివేదించి మైమరతునే॥2॥
నాయేసురాజుతో లయము కాని రాజ్యములో
ప్రవేశింతునే... పరిపూర్ణమైన పరిశుద్ధులతో॥2॥॥అదిగదిగో॥
2. కళ్యాణ రాగాలు ఆత్మీయ క్షేమాలు
తలపోయుచూనే పరవశింతునే 2॥
రాజాధిరాజుతో స్వప్నాల సౌధములో
విహరింతునే. నిర్మలమైన వస్త్రధారినై॥2॥॥అదిగదిగో॥
3. జయించినవాడై సర్వాధికారియై
సింహాసనాశీనుడై నను చేర్చుకొనును ॥2॥
సీయోను రాజుతో రాత్రిలేని రాజ్యములో
ఆరాధింతునే.. వేవేల దూతల పరివారముతో ॥2॥॥అదిగదిగో॥