భూమ్యాకాశములను సృజియించిన దేవా
నీ సన్నిధిలోనే ప్రవేశించెదను
నీ పరిశుద్ధతను ప్రకాశించుటకు
నీ పరిపూర్ణతలో నన్ను నడిపించుము
మహిమా నీకే… ఘనతా నీకే…
ప్రతి దినం నా ఆరాధన నీకే
మహిమా నీకే… ఘనతా నీకే…
నిరంతరం ఈ స్తోత్రార్పణ నీకే
యేసయ్యా.. నీకే వందనం – 4
1. మట్టి ముద్దనైన నన్ను మనిషిగా రూపించావు
వట్టి వాడనైన గాని మహిమతో నను నింపావు - 2
నీ కౌగిలిలో నను హత్తుకొని
అర చేతులలో నను చెక్కుకొని
నీ సన్నిధి కాంతిని నాపైనే ఉదయింపజేసావు - 2
ఏమివ్వగలను నేను నీ ప్రేమకై
పగిలిన హృదయముతో ఆరాధింతును ||మహిమా||
2. ఘోర పాపినైన నన్ను ఎంతగా ప్రేమించావు
సిలువ పైన ప్రాణమిచ్చి వింతగా నను మార్చావు - 2
నా మనో నేత్రమును వెలిగించి
నా హృదయ కాఠిన్యమును మార్చి
అర్హతే లేని బలహీనుడనే ఎన్నుకున్నావు - 2
ఏమిచ్చి నీ ఋణమును నే తీర్తును
విరిగి నలిగిన మనస్సుతో ఆరాధింతును ||మహిమా||
Written & Composed: Kranthi Chepuri
Vocals: Enosh Kumar
No comments:
Write CommentsSuggest your Song in the Comment.