అమరనాధుడా
పల్లవి :
అమరనాధుడా,ఆత్మదేవుడా ఆరాధించెదను - 
గొప్పదేవుడా ప్రాణనథుడా ఆనంధించెదను.
 అనుపల్లవి :
అనుదినం , అనుక్షణం బ్రతుకుట నీ బలం-
ఆయుష్కాలం తండ్రి దేవ నీ వరం -2 
       || అమరనాధుడా||
1)నా జీవం నీ కృపలో దాచిన దేవుడవు - 
గత కాలం క్షేమంగా కాచిన రాజువు -2
క్షణమైనా నిను వీడి నేనుండలేను స్వామి -
చావైనా బ్రతుకైనా నీ సేవలోనే స్వామి -2 
          ||అనుపల్లవి || 
(2) నా భారం  భుజములపై మోసిన తండ్రివి -
నా  హృదయ బాధను ఎరిగిన రాజువు -2
మధురమైన నీ ప్రేమే నా ప్రాకారం ఓ దేవ -
నా చెలిమి నా కలిమి నీవేగా ఓ దేవ 
              ||అనుపల్లవి ||
(3)నా మంచి కాపరివై ఓదార్చిన నా ప్రభువా - 
నీ దివ్య సన్నిధిలో నను నిలిపిన రాజువు-2
నీ చూపే నా బాటై గురి కలిగించే 
యేసయ్య -
నీ మాటే నా శ్వాసై ఇల నడిపించే యేసయ్య  -2
||అనుపల్లవి ||


No comments:
Write CommentsSuggest your Song in the Comment.