కోటి ఆశలతో కొత్త కొత్త ఊహలతో
కోటి ఆశలతో కొత్త కొత్త ఊహలతో
ప్రారంభమైన ప్రయాణం
కావాలి నిత్యం సుఖమయం
ప్రియమైన నవజంటా
అ.ప. సంతోష శుభాకాంక్షలు
నిండైన దైవాశీస్సులు
1. ఇరువురి మధ్యలో విరిసిన ప్రేమలో
స్వచ్ఛత ప్రస్ఫుటించగా
ఏ శోధనకు అవకాశమివ్వక
ఏక మనసుతో విజయాలు పొందగా
2. ఒకరితో మరొకరు పలికిన మాటలో
ఆర్ద్రత పల్లవించగా
ఏ అక్కరకు కలవరము చెందక
వాక్య వెలుగులో ఆదరణ పొందగా
3. నడిచెడు త్రోవలో ఎదురగు బాధలో
సణగక ప్రస్తుతించగా
ఏ ఓటమిలో తలక్రిందులవ్వక
ఆత్మబలముతో ఫలితాలు పొందగా
No comments:
Write CommentsSuggest your Song in the Comment.