మరువను దేవా
ఏ రీతిగా నిను పాడేదను నా ఆశ్రయదుర్గమా
ఏ రీతిగా నిన్ను వర్ణించెదను నా రక్షణ శైలమా "2"
ఇన్నాళ్లుగా నన్ను పోషించినందుకు
ఎనలేని ప్రేమను చూపించినందుకు. "2"
పాడెద స్తుతి గానము - కొనియాడెద నీ నామము "2"
ఇన్నాళ్లుగా నన్ను పోషించినందుకు
ఎనలేని ప్రేమను చూపించినందుకు. "2"
1. తూలనాడిన నా పాప జీవితం
తిరిగి చేర్చేను నీ కరుణా హస్తం "2"
నడుపుము దేవా సరియైన త్రోవలో
దరి చేర్చావే నన్ను నీ నావలో "2"
పాడెద స్తుతి గానము - కొనియాడెద నీ నామము "2"
2. చీకటి బ్రతుకులో వెలుగు దీపమై
చెదరిన వారికి నీవే మార్గమై "2"
మరువను దేవా నీ ఘన మేళ్లను
నీతో నడుచును నా జీవిత పరుగును "2"
పాడెద స్తుతి గానము - కొనియాడెద నీ నామము "2"
ఇన్నాళ్లుగా నన్ను పోషించినందుకు
ఎనలేని ప్రేమను చూపించినందుకు "2"
పాడెద స్తుతి గానము - కొనియాడెద నీ నామము
No comments:
Write CommentsSuggest your Song in the Comment.