Pages - Menu

Pages

Wednesday, June 19, 2019

Lemmu Tejarillumu లెమ్ము తేజరిల్లుము -..Pas.John Wesley anna Latest

                

లెమ్ము తేజరిల్లుము

  పల్లవి :

లెమ్ము తేజరిల్లుము అని - నను ఉత్తేజపరచిన నా యేసయ్యా 

నిన్నే స్మరించుకొనుచు - నీ సాక్షిగా ప్రకాశించుచు 

రాజాధిరాజువని ప్రభువుల ప్రభువని నిను వేనోళ్ళ ప్రకటించెద 



1. ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడుచుటే నా భాగ్యము 
శాశ్వత ప్రేమతో నను ప్రేమించి నీ కృపచూపితివి 
ఇదియే భాగ్యము -  ఇదియే భాగ్యము - ఇదియే నా భాగ్యము
లెమ్ము తేజరిల్లుము అని - నను ఉత్తేజపరచిన నా యేసయ్యా 

నిన్నే స్మరించుకొనుచు - నీ సాక్షిగా ప్రకాశించుచు 

రాజాధిరాజువని ప్రభువుల ప్రభువని నిను వేనోళ్ళ ప్రకటించెద 

2. శ్రమలలో నేను ఇంతవరకును నీతో నిలుచుటే నా ధన్యత 

జీవకిరీటము  నే  పొందుటకే - నను చేరదీసితివి 

ఇదియే ధన్యత - ఇదియే ధన్యత - ఇదియే నా ధన్యత
లెమ్ము తేజరిల్లుము అని - నను ఉత్తేజపరచిన నా యేసయ్యా 

నిన్నే స్మరించుకొనుచు - నీ సాక్షిగా ప్రకాశించుచు 

రాజాధిరాజువని ప్రభువుల ప్రభువని నిను వేనోళ్ళ ప్రకటించెద 
3. తేజోవాసుల స్వాస్థ్యము నేను అనుభవించుటే నా దర్శనము 
తేజోమయమైన షాలేము నగరులో - నిత్యము నినుచూచి తరింతునే 
ఇదియే దర్శనము - ఇదియే దర్శనము - ఇదియే నా దర్శనము
లెమ్ము తేజరిల్లుము అని - నను ఉత్తేజపరచిన నా యేసయ్యా 

నిన్నే స్మరించుకొనుచు - నీ సాక్షిగా ప్రకాశించుచు 

రాజాధిరాజువని ప్రభువుల ప్రభువని నిను వేనోళ్ళ ప్రకటించెద




No comments:

Post a Comment

Suggest your Song in the Comment.