Pages - Menu

Pages

Monday, June 22, 2020

Nee Prema Nalo Song || Hosanna Ministries 30th Album [Manoharuda-Song-1] "MADHURA PREMA" Pas.JOHN WESLEY anna 1080p HD

NEE PEMA NALO MADHURAMAINADI

నీ ప్రేమ నాలో మధురమైనది - అది నా ఊహకందని క్షేమశికరము         ||2||

ఏరికోరుఉన్నావు ప్రేమచూపి నన్ను - పరవశించి నాలో మహిమపరతు నిన్నే

సర్వకృపానిధి నీవు సర్వాధికారివి నీవు - సత్యస్వరూపివి నీవు ఆరధింతును నిన్నే
 
నీ ప్రేమ నాలో

1. చేరితి నిన్నే విరిగిన మనసుతో - కాదనలేదే నా మానవులు నీవు    || 2 ||

హృదయము నిండిన గానం - నను నడిపే ప్రేమ కావ్యం
 
నిరతము నాలో నీవే చెరగని - దివ్య రూపం    || 2 ||

ఇది నీ బాహూబంధాల అనుబంధమా?

తేజోవిరాజ స్తుతి మహిమలు నీకే - నా యేసు రాజ ఆరాధన నీకే      || 2 ||

        నీ ప్రేమ నాలో

2. నా ప్రతిపదములో జీవము నీవే - నా ప్రతిఅడుగులో విజయము నీవే     || 2 ||

ఎన్నడు విడువని ప్రేమ - నిను చేరే క్షణమురాదా

నీడగ నాతో నిలిచే - నీ కృపయే నాకు చాలును   || 2 ||

ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమా?

తేజోవిరాజ స్తుతి మహిమలు నీకే - నా యేసు రాజ ఆరాధన నీకే      || 2 ||

నీ ప్రేమ నాలో

3. నీ సింహాసనము నను చేర్చుటకు - సిలువను మోయుట నేర్పించితి   || 2 ||

కొండలు లోయలు దాటే - మహిమత్మతో నింపినావు

దయగల ఆత్మతో నింపి - సమభూమిపై నడిపినావు        || 2 ||

ఇది నీ ఆత్మ బంధముకై సంకేతమా?

తేజోవిరాజ స్తుతి మహిమలు నీకే - నా యేసు రాజ ఆరాధన నీకే      || 2 ||

నీ ప్రేమ నాలో మధురమైనది - అది నా ఊహకందని క్షేమశికరము         ||2||

ఏరికోరుఉన్నావు ప్రేమచూపి నన్ను - పరవశించి నాలో మహిమపరతు నిన్నే

సర్వకృపానిధి నీవు సర్వాధికారివి నీవు - సత్యస్వరూపివి నీవు ఆరధింతును నిన్నే

  నీ ప్రేమ నాలో

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.