THALACHUKUNTE CHALUNU
తలచుకుంటే చాలును - ఓ యేసు నీ ప్రేమ
జల జల రాలును - కృతజ్ఞత కన్నీళ్ళు
తలచుకుంటే చాలును - కరిగించును రాళ్ళను
కల్వరి స్వరము - ఇది కల్వరి స్వరము
తలచుకుంటే చాలును..........
1. నీ మోమున ఊసిన ఉమ్ములు - నా మోహపు చూపు తుడిచెను
నీ చెంపను కొట్టిన దెబ్బలు - నా నోటి శుద్ధి చేసెను || 2 ||
నీ శిరస్సున గుచ్చిన ముండ్లు - నా మోసపు తలపులు త్రుంచెను || 2 ||
ఎంత త్యాగ పురితమో నీ ప్రేమ.......
ఎంత క్షమ భరితమో నీ ప్రేమ........
తలచుకుంటే చాలును - ఓ యేసు నీ ప్రేమ
తలచుకుంటే చాలును..........
2. నీ దేహము చీరిన కొరడా - నా కామము చీల్చేను
నీ చేతుల కాళ్ళకు మేకులు - నా చీకటి దారి ముసేను || 2 ||
సిలువ నేతుట్టి దారలు - నా కలుషమును కడిగి వేసెను || 2 ||
ఎంత త్యాగ పురితమో నీ ప్రేమ.......
ఎంత క్షమ భరితమో నీ ప్రేమ........
తలచుకుంటే చాలును - ఓ యేసు నీ ప్రేమ
తలచుకుంటే చాలును - కరిగించును రాళ్ళను
కల్వరి స్వరము - ఇది కల్వరి స్వరము
తలచుకుంటే చాలును..........
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.