Pages - Menu

Pages

Sunday, February 21, 2021

దీనుడా అజేయుడ || Deenuda Ajeyuda New Hosanna Song Lyrics 2021 || 2021 Hosanna Latest Telugu Songs

Ajeyudaa ॥ అజేయుడా ॥


 Hosanna Ministries 2021 New Song


 Pas.JOHN WESLEY

 



 
దీనుడా అజేయుడ - ఆదరణ కిరణమా

పూజ్యుడ పరిపూర్ణుడ - ఆనంద నిలయమ 

" 2 "

జీవదాతవు నీవని శృతి మించి పాడనా

జీవధారము నీవని కానుకనై పూజించనా

" 2 "

అక్షయ దీపము నీవే - నా రక్షణ శృంగము నీవే

స్వరార్చనచేసెద నీకే - నా స్తుతులర్పించెద నీకే


దీనుడా అజేయుడ - ఆదరణ కిరణమా

పూజ్యుడ పరిపూర్ణుడ - ఆనంద నిలయమ 




1. సమ్మతిలేని సుడిగుండలే - ఆవరించగా

గమనములేని పోరాటాలే - తరుముచుండగా

నిరుపేదనైన నా యెడల - సందేహమేమి లేకుండా 

  హేతువేలేని ప్రేమ చూపించి - సిలువచాటునే దాచావు   || 2 ||


సంతోషము నీవే - అమృత సంగీతము నీవే

స్తుతిమాలిక నీకే - వజ్రసకల్పము నీవే


దీనుడా అజేయుడ ఆదరణ కిరణమా

పూజ్యుడ పరిపూర్ణుడ ఆనంద నిలయమ
 


2. సత్య ప్రమాణము నెరవేర్చుటకే - మార్గదర్శివై

నిత్య నిబంధన నాతోచేసిన - సత్యవంతుడా

విరిగి నలిగిన మనస్సుతో - హృదయర్చనే చేసెద

        కరుణ నీడలో - కృపావాడలో - నీతో ఉంటే చాలయ్యా    || 2 ||


కర్తవ్యము నీవే - కనుల పండుగ నీవేగా

విశ్వాసము నీవే - విజయశిఖరము నీవేగ


దీనుడా అజేయుడ ఆదరణ కిరణమా

పూజ్యుడ పరిపూర్ణుడ ఆనంద నిలయమ
 

3. ఊహకందని ఉన్నతమైనది - దివ్యనగరమే 

స్పటికము పోలిన సుందరమైనది - నీరాజ్యమే

ఆ నగరమే లక్ష్యమై - మహిమాత్మతో నింపినావు

అమరలోకన - నీసన్నిధిలో - క్రొత్త కీర్తనేపాడేదను   || 2 ||


ఉత్సాహము నీవే - నాయనోత్సవం నీవేగ

ఉల్లాసము నీలో - ఊహలపల్లకి నీవేగ 
 


దీనుడా అజేయుడ - ఆదరణ కిరణమా

పూజ్యుడ పరిపూర్ణుడ - ఆనంద నిలయమ 

" 2 "

జీవదాతవు నీవని శృతి మించి పాడనా

జీవధారము నీవని కానుకనై పూజించనా

" 2 "

అక్షయ దీపము నీవే - నా రక్షణ శృంగము నీవే

స్వరార్చనచేసెద నీకే - నా స్తుతులర్పించెద నీకే






7 comments:

Suggest your Song in the Comment.