Pages - Menu

Pages

Sunday, March 28, 2021

Neeve Hrudaya Saradhi Song Lyrics ॥ నీవే హృదయ సారధి Song Lyrics ॥ Hosanna Ministries New Song Lyrics || Pas.JOHN WESLEY

 Neeve Hrudaya Saradhi Song Lyrics -

- నీవే హృదయ సారధి Song Lyrics -

 Hosanna Ministries New Song Lyrics -

Pas.JOHN WESLEY

 

 
 
నీవే హృదయ సారధి - ప్రగతికి వారధి  
 
నీ స్నేహమే సౌభాగ్యము - సంక్షేమ సంతకం  
 
నా పాటకే సౌందర్యము - నీవే యేసయ్యా
 
 
 
1. మదిలో చేదుజ్ఞాపకాల విలయ వేదిక కూల్చి  "2"
 
చిగురాశల దిశగా నను పయనింపజేసినా 
 
 నీ మాటలు స్థిరపరచెను విశ్వాస ప్రేమలో 
 
 కలనైనా అనుకోని అనురాగ బంధమైతివే 
 
 " నీవే హృదయ "
 
 
 
2. నీవు లేని జీవితం ప్రళయసాగరమే  "2"
 
దిక్కుతోచని సమయములో నీవేదిక్సూచివై  
 
చుక్కానిగ నడిపించుము ఆత్మీయ యాత్రలో 
 
 కనుపాపగ నను కాచిన నామంచి కాపరి 
 
 " నీవే హృదయ " 
 
 
 
3.చేరనైతి కోరనైతి స్నేహ సౌధము  "2"
 
చిరుదివ్వెగ దరిచేరి చేర్చావు సన్నిధి  
 
చావైనా బ్రతుకైనా నీకోసమే ప్రభు  
 
చాటింతు నీ ప్రేమను ప్రణుతింతు ప్రేమ సాగరా 
 
 " నీవే హృదయ "  
 
 
 
నీవే హృదయ సారధి - ప్రగతికి వారధి  
 
నీ స్నేహమే సౌభాగ్యము - సంక్షేమ సంతకం  
 
నా పాటకే సౌందర్యము - నీవే యేసయ్యా
 



6 comments:

Suggest your Song in the Comment.