పల్లవి: 
ఎందుకంత కన్నీరు ఎందుకావేదన 
నీ దు: ఖదినములన్నీ సమాప్తమైనవని 
తెలుసుకో నేస్తమా యేసయ్యా మాటిది 
1. పరలోక మహిమను నీ కొరకు విడిచెను 
తన ప్రాణము పెట్టి - నిను బ్రతికించెను 
ఇంత చేసిన వాడు నీకు దూరమౌతాడా 
సందేహమును వీడి సిలువ దర్శనము పొంది 
బ్రతికితే క్రీస్తు కొరకే చావైతే లాభమనుకో 
ప్రాణమా నాలో తొందర పడకు మా..... 
ఎందుకంత కన్నీరు ఎందుకావేదన 
నీ దు: ఖదినములన్నీ సమాప్తమైనవని 
తెలుసుకో నేస్తమా యేసయ్యా మాటిది 
 2. మన్ను అడ్డుగుందని మొలకెత్తకుందువా 
రాళ్ళు రువ్వుతారని ఫలింపకుందువా 
ఎండిన భూమిలో మొలచిన మొక్కవలె 
పెరిగెను యేసయ్య ద్రాక్షావల్లిగా 
అంటుగట్ట బడి నీవు - బహుగా ఫలించుమా 
ప్రాణమా... నాతో.. తొందర పడకుమా.... 
ఎందుకంత కన్నీరు ఎందుకావేదన 
నీ దు: ఖదినములన్నీ సమాప్తమైనవని 
తెలుసుకో నేస్తమా యేసయ్యా మాటిది 
  3. అపజయము మధ్య - వెనుకంజ వేయకుమా 
పోరాడుచున్నది అంధకార శక్తులతో 
దేవుడిచ్చు సర్వాంగ కవరమును ధరించుకొని 
 ధూపార్తి చేబూని స్తుతియాగము చేయచూ 
జయమే ఊపిరిగా గురియొద్దకే సాగిపో 
ప్రాణమా... నాలో తొందరపడకుమా
ఎందుకంత కన్నీరు ఎందుకావేదన 
నీ దు: ఖదినములన్నీ సమాప్తమైనవని 
తెలుసుకో నేస్తమా యేసయ్యా మాటిది