Halaman

Pages - Menu

Pages

Saturday, August 28, 2021

Neevu Lekapothe Na Brathuke Ledayya Song Lyrics || నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా Song Lyrics || Thandri Sannidhi Ministries New Songs || Shalem Raju Anna Songs || Vol-11 || 2020

 

 
 
పల్లవి:   నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా
 
నువు చేరదీయపోతే నా మనసే చేదయ్యా  
 
నువు నాకుంటే ఎన్నడు నేను ఒంటరి కానయ్యా  
 
నీ కృప నాకు తోడై వుంటే అంతే చాలయ్యా  
 
అప. యేసయ్యా.... యేసయ్యా....
 
 
 
1. సిరి సంపదలు కలిగిన వేళ - అందరూ హత్తుకు వుంటారు  
 
సంపదలన్ని తరిగిన వేళ కంటికి ఎవ్వరు కనరారు
 
 ఎవరున్నా... ఆ .... లేకున్నా.... ఆ .......  
 
ఏ స్థితిలో నేనున్నా - నన్ను విడువని నమ్మకస్థుడవు నీవే యేసయ్యా  
 
 
నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా
 
నువు చేరదీయపోతే నా మనసే చేదయ్యా   



2. విరిగిన దానిని లోకంలో ఎవ్వరు కోరుకుంటారు?
 
విరిగిన మనసును వాడుకునే నీతో ఎవ్వరు సరిరారు 
 
 దీనులను... హీనులను  
 
జ్ఞానులుగా.... శ్రీమంతులుగా - మార్చగలిగిన మంచి దేవుడవు నీవే యేసయ్యా  
 
 
నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా
 
నువు చేరదీయపోతే నా మనసే చేదయ్యా  
 
 
నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా
 
నువు చేరదీయపోతే నా మనసే చేదయ్యా  
 
నువు నాకుంటే ఎన్నడు నేను ఒంటరి కానయ్యా  
 
నీ కృప నాకు తోడై వుంటే అంతే చాలయ్యా  
 
అప. యేసయ్యా.... యేసయ్యా....
 
 
 

Thursday, August 26, 2021

Saswathamainadi Neevu Naa Yada - శాశ్వతమైనది నీవు నా యెడ by Bro.Yesanna || Hosanna Ministries


 
 
శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప  
 
అనుక్షణం నను కనుపాపవలె (2) 
 
 కాచిన కృప 
 
 ||శాశ్వతమైనది||  
 
 
 
1.నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి (2)  
 
నిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో (2) 
 
 
శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప  
 
అనుక్షణం నను కనుపాపవలె (2) 
 
 కాచిన కృప 
 
 ||శాశ్వతమైనది|| 
 
 
 
2.తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే (2)  
 
నీదు ముఖకాంతియే నన్ను ఆదరించెనులే (2) 
 
 
శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప  
 
అనుక్షణం నను కనుపాపవలె (2) 
 
 కాచిన కృప 
 
 ||శాశ్వతమైనది|| 
 
 
3.పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన (2)  
 
నా కృప నిను వీడదని అభయమిచ్చితివే (2) 
 
 
శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప  
 
అనుక్షణం నను కనుపాపవలె (2) 
 
 కాచిన కృప 
 
 ||శాశ్వతమైనది|| 

Monday, August 2, 2021

Hrudayamanedu Talupu nodda || హృదయమనెడు తలుపు నొద్ద || Andhra kraistava keerthanalu || Sri Pulipaka Jagannadham

 
 
Written by: #PulipakaJagannadham garu 
 
Voice over: Sri. Acharya RRK Murthy garu 
 
Credits to: original composers
 
 
 
 
హృదయమనెడు తలుపు నొద్ద – యేసు నాథుండు 
 
నిలచి – సదయుడగుచు దట్టుచుండు – సకల విధములను (2)
 
 ||హృదయ||
 
పరుని బోలి నిలుచున్నాడు – పరికించి చూడ 
 
నతడు – పరుడు గాడు రక్షకుండు – ప్రాణ స్నేహితుడు (2) 
 
||హృదయ||  
 
కరుణా శీలుండతడు గాన – గాచి యున్నాడు 
 
యేసు – కరుణ నెరిగి గారవింప – గరము న్యాయంబు (2) 
 
||హృదయ|| 
 
ఎంత సేపు నిలువ బెట్టి – యేడ్పింతు రతని 
 
నాత – డెంతో దయచే బిలుచుచున్నా – డిప్పుడు మిమ్ములను (2) 
 
 ||హృదయ||
 
అతడు మిత్రుడతడు మిత్రుం – డఖిల పాపులకు 
 
మీర – లతని పిలుపు వింటి రేని – యతడు ప్రియుడగును (2) 
 
||హృదయ||  
 
జాలి చేత దన హస్తముల – జాపి యున్నాడు 
 
మిమ్ము – నాలింగనము సేయ గోరి – యనిశము కనిపెట్టు (2) 
 
||హృదయ||  
 
సాటిలేని దయగల వాడు – సర్వేశు సుతుడు 
 
తన – మాట వినెడు వారల నెల్ల – సూటిగ రక్షించు (2) 
 
||హృదయ|| 
 
చేర్చుకొనుడి మీ హృదయమున – శ్రీ యేసునాథు 
 
నతడు – చేర్చుకొనుచు మీ కిచ్చును – చీర జీవము కృపను (2) 
 
||హృదయ|| 
 
అతడు తప్పక కలుగజేయు – నఖిల భాగ్యములు 
 
మీర – లతని హత్తుకొందు రప్పు – డానందము తోడ (2) 
 
||హృదయ|| 
 
బ్రతుకు శాశ్వతంబు కాదు – పరికించు చూడు 
 
గాన – బ్రతికి యుండు కాలముననే – ప్రభుని గొలువండి (2) 
 
 ||హృదయ|| 
 
  

Sunday, August 1, 2021

Telugu Christian Podcast || తెలుగు క్రైస్తవ అంకాత్మక శ్రవ్య శ్రేణి || By Suresh Vanguri || 2021

తెలుగు క్రైస్తవ అంకాత్మక శ్రవ్య శ్రేణి(Telugu Christian Podcast)

జీవితం

సురేశ్ వంగూరి: ఒక చిన్న ప్రయోగం దేవుడు ఇచ్చిన తలంపు, చాలా సంవత్సరాలుగా దేవుడు నా హృదయంలో పెట్టిన  భారం ఈ అప్ప్. దేవుడి సత్యాన్ని సరళీకృతం చేయబడి అందరికీ అర్దం అయ్యేలాగా రోజు వ్యక్త పరచాలని ఒక ప్రయత్నం. ప్రతి విశ్వాసిని దృష్టిలో పెట్టుకొని కొంత సత్యమైన క్రైస్తవ పునాది మరియు మౌలిక సత్యాలు ప్రతిరోజు నేర్చుకోవాలని ఒక ప్రయత్నం. ఒక అధ్యాత్మికమైన బోధన ఈ App ద్వారా చేరవేయాలని నా ప్రయత్నం. 

1. App Installation: గూగుల్ ప్లేస్టోర్ కి వెళ్ళి 


 

2. Jeevitham Podcast By Suresh Vanguri అని టైప్ చేయండి. 

 


3. జీవితం చిహ్నం మీకు కనబడుతుంది మీరు దాన్ని క్లిక్ చేసినట్లైతే ఇంస్టాల్ అని కనబడుతుంది. 

 


 

4. మీ స్మార్ట్ ఫోన్లో ఇంస్టాల్ అవుతుంది. 

 


5. రోజు ఒక భక్తిపరమైన ఆలోచనని మీరు వెంబడించవచ్చు.

Picture from flaticon