Pages - Menu

Pages

Tuesday, January 25, 2022

Madhuram Madhuram Naa Priya Song Lyrics || మధురం మధురం నా ప్రియ యేసుని చరితం మధురం Song Lyrics || Hosanna Ministries Songs Lyrics


మధురం మధురం నా ప్రియ యేసుని చరితం మధురం

శాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం (2)

దీన మనస్సు – దయ గల మాటలు

సుందర వదనం – తేజోమయుని రాజసం (2)  ||మధురం||



1. ఆశ్చర్యకరమైన వెలుగై దిగివచ్చి – చీకటిలో ఉన్న వారిని

బంధింప బడియున్న వారిని విడుదల చేయుటకు (2)

నిరీక్షణ కలిగించి వర్దిల్ల చేయుటకు

యేసే సరిపాటి నా యేసే పరిహారి (2) ||మధురం||



2. పరిపూర్ణమైన నెమ్మదినిచ్చుటకు – చింతలన్నియు బాపుటకు

ప్రయాసపడు వారి భారము తొలగించుటకు (2)

ప్రతిఫలము నిచ్చి ప్రగతిలో నడుపుటకు

యేసే సరిపాటి నా యేసే పరిహారి (2) ||మధురం||



3. కలవర పరిచే శోధనలెదురైన – కృంగదీసే భయములైనను

ఆప్యాయతలు కరువైన ఆత్మీయులు దూరమైనా (2)

జడియకు నీవు మహిమలో నిలుపుటకు

యేసే సరిపాటి నా యేసే పరిహారి (2) ||మధురం||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.