Pages - Menu

Pages

Monday, January 17, 2022

sandhehamela samsheyamedhaela Song Lyrics || సందేహమేలా Song Lyrics | N Michael Paul


సందేహమేల - సంశయమదేల

ప్రభు యేసుగాయములను పరికించిచూడు

గాయాలలో నీవ్రేలు తాకించి చూడు



1. ఆ ముండ్లు మకుటము నీకై - ధరియించెనే

నీ పాప శిక్షను యేసు భరియించెనే (2)

ప్రవహించె రక్తధార నీ కోసమే

కడు గోర హింసనొందె నీ కోసమే (2) ||సందేహ||



2. లోకాన ఎవ్వరు నీకై మరణించరు

నీ శిక్షలను భరయింప సహయింపర (2)

నీ తల్లియైన గాని నిను మరచునే

ఆ ప్రేమ మూర్తి నిన్ను మరువజాలనా (2) ||సందేహ||



3. ఎందాక యేసుని నీవు ఎరుగకుందువు

ఎందాక హృదయము బయట నిలువ మందువు (2)

యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనా

యేసయ్య సిలువ సువార్త చులకనాయెనా (2) ||సందేహ||



4. ఈ లోక బోగాలను వీడజాలవా

సాతాను బందకమందే సంతసింతువా (2)

యేసయ్య సహనము తోడ చెలగాటమా

ఈ నాడే రక్షణ దినము గ్రహియించుమా (2) ||సందేహ||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.