నేను వెళ్ళేమార్గము నాయేసుకే తెలియును (2)
శోదింప బడిన మీదట నేను సువర్ణమై మారెదను (2)
హల్లేలూయా. . .హల్లేలూయా. . .హల్లేలూయా. .ఆమేన్ (2)
1. కడలేని కడలి తీరము ఎడమాయె కడకు నా బ్రతుకున
గురిలేని తరుణాన వెరవగ నా దరినే నిలిచేవా నా ప్రభు
2. జలములలో బడి నే వెళ్లినా అవి నా మీద పారవు
అగ్నిలో నేను నడచినా జ్వాలలు నను కాల్చజాలవు
3. విశ్వాస నావ సాగుచు పయనించు సమయాన నా ప్రభు
సాతాను సుడిగాలి రేపగా నాయెదుటేనిలిచేవా నా ప్రభు
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.