Pages - Menu

Pages

Wednesday, February 23, 2022

Vinarandi Naa Priyuni Song Lyrics || వినరండి నా ప్రియుని విశేషము Song Lyrics || Hosanna Ministries Songs Lyrics


వినరండి నా ప్రియుని
విశేషము

నా ప్రియుడు (వరుడు) సుందరుడు మహా ఘనుడు ||2||

నా ప్రియుని నీడలో చేరితిని

ప్రేమకు రూపము చూసితిని ||2||

ఆహ ఎంతో మనసంతా ఇక ఆనందమే

తనువంతా పులకించి మహదానందమే ||వినరండి||



1. మహిమతో నిండిన వీధులలో

బూరలు మ్రోగే ఆకాశ పందిరిలో ||2||

జతగా చేరెదను ఆ సన్నిధిలో

కురిసె చిరుజల్లై ప్రేమామృతము

నా ప్రియ యేసు నను చూసి దరి చేరునే

జతగా చేరెదను ఆ సన్నిధిలో

నా ప్రేమను ప్రియునికి తెలిపెదను

కన్నీరు తుడిచేది నా ప్రభువే ||వినరండి||



2. జగతికి రూపము లేనప్పుడు

కోరెను నన్ను తన కొరకు నా ప్రభువు ||2||

స్తుతినే వస్త్రముగా ధరించుకొని

కృపన్ జయధ్వనితో కీర్తించెదను

నా ప్రభు యేసు చెంతన చేరెదను

స్తుతినే వస్త్రముగా ధరించుకొని

నా ప్రభు యేసు చెంతన చేరెదను

యుగమొక క్షణముగ జీవింతును ||వినరండి||



3. తలపుల ప్రతి మలుపు గెలుపులతో

నిలిచె శుద్ధ హృదయాల వీరులతో ||2||

ఫలము ప్రతిఫలము నే పొందుకొని

ప్రియ యేసు రాజ్యములో నే నిలిచెదను

ఆ శుభవేళ నాకెంతో ఆనందమే

ఫలము ప్రతిఫలము నే పొందుకొని

ఆ శుభవేళ నాకెంతో ఆనందమే

నా ప్రియుని విడువను నేనెన్నడు ||వినరండి||


SONG NO : 252

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.