Halaman

Pages - Menu

Pages

Thursday, March 17, 2022

Bhasillenu Siluvalo Song Lyrics || భాసిల్లెను సిలువలో Song Lyrics || Andhra Kraisthava Keerthanalu Songs ||

  

 
భాసిల్లెను సిలువలో పాపక్షమా 
                    యేసు ప్రభూ నీ దివ్య క్షమా     ||భాసిల్లెను|| 
 
 
1. కలువరిలో నా పాపము పొంచి 
సిలువకు నిన్ను యాహుతి చేసి 
                        కలుషహరా కరుణించితివి (2)        ||భాసిల్లెను||
 
 
2. దోషము చేసినది నేనెకదా 
మోసముతో బ్రతికిన నేనెకదా 
                         మోసితివా నా శాపభారం (2)        ||భాసిల్లెను|| 
 
 
3. పాపము చేసి గడించితి మరణం 
శాపమెగా నేనార్జించినది 
                           కాపరివై నను బ్రోచితివి (2)       ||భాసిల్లెను|| 
 
 
4. నీ మరణపు వేదన వృధా గాదు 
నా మది నీ వేదనలో మునిగెను 
                        క్షేమము కలిగెను హృదయములో (2)       ||భాసిల్లెను|| 
 
 
 5. ఎందులకో నాపై ఈ ప్రేమ 
అందదయ్యా స్వామీ నా మదికి 
                         అందులకే భయమొందితిని (2)        ||భాసిల్లెను||
 
 
6. నమ్మిన వారిని కాదన వనియు 
నెమ్మది నొసగెడి నా ప్రభుడవని 
                       నమ్మితి నీ పాదంబులను (2)       ||భాసిల్లెను||
 
 
SONG NO - 261 

Monday, March 14, 2022

KALVARI GIRIPAI SILUVA BHARAM Song Lyrics || Telugu Christian Songs Lyrics || Good Friday Song Lyrics ||


 
 
కల్వరి గిరిపై సిలువ భారం 

భరించితివా ఓ నా ప్రభువా
 
నా పాపముకై నీ రక్తమును 

   సిలువ పైన అర్పించితివా (2)
 
 
1. దుష్టుండనై బల్లెము బూని 

గ్రుచ్చితి తండ్రి ప్రక్కలోన (2) 

కేక వేసి నీదు ప్రాణం 

                 సిలువ పైన అర్పించితివా (2)       

||కల్వరి||
 

 
2. మూడు దినములు సమాధిలో 

ముదము తోడ నిద్రించితివా (2) 

నా రక్షణకి సజీవముతో 

                 సమాధిన్ గెల్చి లేచిన తండ్రి (2)      

||కల్వరి|| 
 
 
 
3. ఆరోహణమై వాగ్ధానాత్మన్ 

సంఘము పైకి పంపించితివా (2) 

నీ రాకడకై నిరీక్షణతో 

          నిందలనెల్ల భరించెదను (2)      

||కల్వరి|| 
 
 
Song No: 260 

Saturday, March 5, 2022

Sarvabhumiki Rajaina Deva Song Lyrics || సర్వభూమికి రాజైన దేవా Song Lyrics || NEW SONG BY BRO.SHALEM RAJU GARU



పల్లవి : సర్వ భూమికి రాజైన దేవా..
సర్వశక్తుడ నీవే నా ప్రభువా 
     రమ్యముగా కీర్తనలే నే పాడెదా || 2 ||
 
సర్వ భూమికి రాజైన దేవా..
సర్వశక్తుడ నీవే నా ప్రభువా
 
 
1.ఆర్భాటముతో జయధ్వనులతో - సర్వజనులంత చప్పట్లతో  || 2 ||

  విజయశీలుడవు నీవే యని - విశ్వాసముతో స్తుతించెదము  || 2 ||
 (సర్వ భూమికి)
 
 
2.ఆ దివిలో పరిశుద్ధులు - పాడుచుందురే స్తోత్రములు  || 2 ||
ఈ భువిలో నీ పిల్లలు   || 2 ||
అనుభవింతురే నీ మహిమలు || 2 ||
 ( సర్వభూమికి)  
 
 
 3.సర్వప్రాణులు ప్రతి ఉదయం - వేడుచుండునే నీ సాయం   || 2 ||
 
నిను ప్రేమించే ప్రతి హృదయం || 2 ||
 
కోరుచుండునే నీ స్నేహం || 2 ||
 
సర్వ భూమికి రాజైన దేవా..
సర్వశక్తుడ నీవే నా ప్రభువా   || 2 ||
  రమ్యముగా కీర్తనలే నే పాడెదా || 2 ||
 
 
ఆరాధన....స్తుతి
ఆరాధన....స్తుతి
ఆరాధన....స్తుతి
ఆరాధన....స్తుతి ఆరాధన....స్తుతి  
 

Friday, March 4, 2022

Mahadhanandhamaina Needhu Sannidhi Song Lyrics || Hosanna New Songs 2022 || Hosanna Ministries Songs


మహాదానందమైన 
నీదు సన్నిధి 

ఆపత్కాలమందు దాగుచోటది

మనవులు అన్నియు ఆలకించిన 

వినయముగలవారికి  ఘనతనిచ్చిన

నీ సింహాసనమును స్థాపించుటకు

నీవు కోరుకున్న సన్నిధానము ||2||

 ఎంత మధురము నీ ప్రేమమందిరం

పరవశమే నాకు యేసయ్య||2|| ||మహాదానందమైన||



1. విసిగిన హృదయం కలవరమొంది 

వినయము కలిగి నిన్ను చేరగ ||2||

పరమందుండి నీవు కరుణచూపగ 

లేత చిగురుపైన మంచు కురియు రీతిగా ||2||

ప్రేమను చూపి - బాహువు చాపి

 నీలో నన్ను లీనము చేసిన ||2||

ప్రేమసాగర జీవితాంతము

నీ సన్నిధిని కాచుకొందును ||2|| ||మహాదానందమైన||



2. లెక్కించలేని స్తుతులతో నీవు

 శాశ్వత కాలము స్తుతినొందెదవు  ||2||

మహిమతో నీవు సంచరించగా

 ఏడుదీపస్తంభములకు వెలుగు కలుగగా ||2||

ఉన్నతమైన ప్రత్యక్షతను

నే చూచుటకు కృపనిచ్చితివి ||2||

కృపసాగర వధువు సంఘమై

 నీ కోసమే వేచియుందును||2|| ||మహాదానందమైన||




3. సియోను శిఖరమే నీ సింహాసనం

 శుద్ధులు నివసించు మహిమనగరము ||2||

ఎవరు పాడలేని కొత్త కీర్తన 

మధురముగా నీయెదుట  నేను పాదెద ||2||

సౌందర్యముగా అలంకరించిన 

నగరములోనే నివసించెదను ||2||

ప్రేమ పూర్ణుడా మహిమాన్వితుడా 

నీతోనే రాజ్యమేలదా||2|| ||మహాదానందమైన||

Thursday, March 3, 2022

Athisundarudavu Yessaiah Song Lyrics || అతిసుందరుడవు యేసయ్య Song Lyrics || Ministries 32nd Album Srikaruda Naa Yesayya || Song-6 ||


అతిసుందరుడవు యేసయ్య - మనోహరుడవు నీవయ్యా  ||2||
 
యదార్ధవంతుల సభలో పరిశుద్దులుతో - కలసి నిన్ను ఆరాధించెదను  ||2||

హల్లెలూయా  హల్లెలూయా హల్లెలూయా  - హోసన్నా ఆరాధన  ||2||



1.నీ సన్నిధిలో సంపూర్ణమైన - సంతోషము కలదు

కృపాక్షేమములు మందిరములు - సమృద్ధిగా కలవు  ||2||

నే దీనుడనై నీ సన్నిధిని - అనుభవించెదను  ||2||

పరవశించి పరవళ్ళుత్రొక్కి - ఆరాధించెదను  ||2||  

                                                                    ||అతిసుందరుడవు||



2. అమూల్యమైన వాగ్దానములు - అనుగ్రహించావు

అత్యధికముగా ఆశీర్వదించి - హెచ్చించియున్నావు  ||2||
 
విశ్వసముతో ఓర్పుకలిగి వాగ్దానమునే - పొందెదను  ||2|| 
 
సంపూర్ణతకై పరిశుద్దుడనై - ఆరాధించెదను  ||2||
                                                                      ||అతిసుందరుడవు||




3. మహారాజువై సీయోనులో - ఏలుచున్నావు 

పునాదులు గల పట్టణమును - కట్టుచున్నావు  ||2||

సౌందర్యముగల సీయోనులో - ప్రకాశించుచున్నావు  ||2||

నీ మహిమనుపొంది నీ దరి చేరి - ఆరాధించెదను  ||2||

                                                                            ||అతిసుందరుడవు||




ఆరాధనకు నీవే యోగ్యుడవు - స్తుతులకు నీవే పాత్రుడవు ||2||

అతి సుందరుడా - మనోహరుడా  ||2||

                                                 ||అతిసుందరుడవు||

Preme Saswathamaina Song Lyrics || AMARAMAINA PREMA Song Lyrics || HOSANNA MINISTRIES NEW SONG || PASTOR.JOHN WESLEY



ప్రేమే శాశ్వతమైన - పరిశుద్ధమైన పొదరిల్లు  || 2 ||

మనస్సే మందిరమాయె - నా మదిలో దీపము నీవే
 
నిన్నాశ్రయించిన వారిని - ఉదయించు సూర్యునివలేనే

          నిరంతరం నీ మాటతో - ప్రకాశింపజేయుదువు   ||ప్రేమే|| 



1. అమరమైన నీ చరితం - విమలమైన నీ రుధిరం 

ఆత్మీయముగా ఉత్తేజపరచిన - పరివర్తనక్షేత్రము  || 2 ||

ఇన్నాళ్లుగ నను స్నేహించి - ఇంతగ ఫలింపజేసితివి

ఈ స్వరసంపదనంతటితో - అభినయించి నే పాడెదను

ఉండలేను - బ్రతుకలేను 

నీతోడు లేకుండా - నీ నీడలేకుండా    ||ప్రేమే|| 



 2. కమ్మనైన నీ ఉపదేశము - విజయమిచ్చే శోధనలో 

ఖడ్గముకంటే బలమమైన వాక్యము - ధైర్యమిచ్చే నా శ్రమలో  ||2 ||

కరువుసీమలో సిరులోలికించెను - నీ వాక్యప్రవాహమే

గగనము చీల్చి మోపైన దీవేన వర్షము కురుపించితివి

               ఘనమైన నీ కార్యములు వివరింప నా తరమా - వర్ణింప తరమా  ||ప్రేమే||



3. విధిరాసిన విషాదగీతం సమసిపోయే నీ దయతో  

 సంబరమైన వాగ్దానములతో  నాట్యముగా మార్చితివి ||2||

మమతల వంతెన దాటించి మహిమలో  స్థానమునిచ్చితివి

నీ రాజ్యములో జేష్టులతో యుగయుగములు నే ప్రకాశించనా
 
              నా పైన ఎందుకింత గాడమైన ప్రేమ నీకు మరువలేను యేసయ్య  ||ప్రేమే||

Krupa Krupa Sajeevulatho Song Lyrics || శ్రీకరుడా నా యేసయ్యా Song Lyrics || Hosanna Ministries 32nd Album [Srikaruda Naa Yesayya] || Song 5 || Pas.Ramesh Anna

 

కృపా - కృపా సజీవులతో 

       నను నిలిపినది నీ కృపా   || 2 ||
 
నా శ్రమదినమున నాతో నిలిచి

        నను ఓదార్చిన నవ్యకృప నీదు కృప   || 2 || 

కృపా సాగర మహోన్నతమైన - నీ కృప చాలునయా || కృపా||



1. శాశ్వతమైన నీ ప్రేమతో - నను ప్రేమించిన శ్రీకారుడా

        నమ్మకమైన నీ సాక్షినై నే - నీ దివ్య సన్నిధిలో నన్నొదిగిపోని   || 2 ||

       నీ ఉపదేశమే నాలో ఫలబరితమై - నీ కమనియ్యకాంతులను విరజిమ్మెనే  || 2 ||

నీ మహిమను ప్రకటింప - నను నిలిపేనే   || కృపా|| 



2. గాలితుఫానుల అలజడితో - గూడుచెదరిన గువ్వవలె

గమ్యమును చూపే నిను వేడుకొనగా - నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించితివి || 2 ||

నీ వాత్యల్యమే నవ వసంతము - నా జీవిత దినములు ఆద్యంతము  ||2||

ఒక్క క్షణమైన విడువని ప్రేమామృతము    || కృపా||



3. అత్యునతమైన కృపలతో -ఆత్మఫలము సంపదతో

 అతిశ్రేష్టమైన స్వాస్త్యమును పొంది - నీ ప్రేమ రాజ్యములో హర్షించువేళ  || 2 || 

నా హృదయార్పణ నిను మురిపించని - నీ  గుణాతిశయములను కీర్తించని   || 2 ||
 
ఈ నీరీక్షణ నాలో నెరవేరని     || కృపా||


Padedha Sthuthi Gaanamu Song Lyrics || పాడెద స్తుతి గానము Song Lyrics || Hosanna Ministries 32nd Album [Srikaruda Naa Yesayya] || Song3 || Pas.Abraham Anna


పా
డెద స్తుతి గానము - కొనియాడెద నీ నామము || 2 ||
నీవే నా ప్రేమానురాగం - క్షణమైన విడువని స్నేహం
          అతిశ్రేష్టుడా నా యెస్సయ్యా  || 2 ||  
 
 || పాడేద ||
 
 
1. ఇల నాకెవ్వరు లేరనుకొగా - నా దరి చేరితివే
 నే నమ్మినవారే నను మరచినను - మరువని దేవుడవు || 2 ||

నీ ఆశాలే నాలో చిగురించెను - నీ వాక్యమే నన్ను బ్రతికించెను || 2 ||
           నీ అనుబంధము నాకానందమే ||2||   || పాడేద ||


2. నా ప్రతి అణువును పరిశుద్ధపరచెను -  నీ రుధిదారాలే
నీ దర్శనమే నను నిలిపినది - ధరణిలో నీ కొరకే    || 2 ||
 
నీ చేతులే నను నిర్మించెను - నీ రూపమే నాలో కలిగెను   || 2 ||
             నీ అభిషేకము పరమానందమే || 2 ||    || పాడేద ||


3. బలహీనతలో నను బలపరచి - ధైర్యము నింపితివే 
నా కార్యములు సఫలముచేసి  - ఆత్మతో నడిపితివి || 2 ||
 
యూదగోత్రపు కొదమ సింహమా - నీతో నిత్యము విజయహసమే || 2 ||
                      నీ పరిచర్యలో మహిమానందమే   || 2 ||    || పాడేద ||