అతిసుందరుడవు యేసయ్య - మనోహరుడవు నీవయ్యా ||2||
యదార్ధవంతుల సభలో పరిశుద్దులుతో - కలసి నిన్ను ఆరాధించెదను ||2||
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా - హోసన్నా ఆరాధన ||2||
1.నీ సన్నిధిలో సంపూర్ణమైన - సంతోషము కలదు
కృపాక్షేమములు మందిరములు - సమృద్ధిగా కలవు ||2||
నే దీనుడనై నీ సన్నిధిని - అనుభవించెదను ||2||
పరవశించి పరవళ్ళుత్రొక్కి - ఆరాధించెదను ||2||
||అతిసుందరుడవు||
2. అమూల్యమైన వాగ్దానములు - అనుగ్రహించావు
అత్యధికముగా ఆశీర్వదించి - హెచ్చించియున్నావు ||2||
విశ్వసముతో ఓర్పుకలిగి వాగ్దానమునే - పొందెదను ||2||
సంపూర్ణతకై పరిశుద్దుడనై - ఆరాధించెదను ||2||
||అతిసుందరుడవు||
3. మహారాజువై సీయోనులో - ఏలుచున్నావు
పునాదులు గల పట్టణమును - కట్టుచున్నావు ||2||
సౌందర్యముగల సీయోనులో - ప్రకాశించుచున్నావు ||2||
నీ మహిమనుపొంది నీ దరి చేరి - ఆరాధించెదను ||2||
||అతిసుందరుడవు||
ఆరాధనకు నీవే యోగ్యుడవు - స్తుతులకు నీవే పాత్రుడవు ||2||
అతి సుందరుడా - మనోహరుడా ||2||
||అతిసుందరుడవు||
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.