Halaman

Pages - Menu

Pages

Saturday, June 25, 2022

Yesayya Nee Prema Naa Sonthamu Song Lyrics/Sireesha B/Joshua Shaik/Pranam Kamlakhar/Telugu Christian Songs 2022



యేసయ్య నీ ప్రేమ నా సొంతము - నాలోన పలికిన స్తుతిగీతము
యేసయ్య నీవేగ తొలికిరణము - నాలోన వెలిగిన రవికిరణము
ఏనాడు ఆరని నా దీపము - నా జీవితానికి ఆధారము
ఇమ్మానుయేలుగా నీ స్నేహము - నాలోన నిత్యము ఒక సంబరం


1. ఏపాటి నన్ను ప్రేమించినావు - నీ ప్రేమలోనే నను దాచినావు
నా భారమంతా నువు మోసినావు - నన్నెంతగానో హెచ్చించినావు
నీ కృపలోనే నను కాచినావు - నీ కనికరమే చూపించినావు
నా హృదిలోనే నీ వాక్యధ్యానం - నా మదిలోనే నీ నామస్మరణం నిన్నే ఆరాధించి - నీ దయలో నే జీవించి
నిన్నే నే పూజించి - నీలో నే తరియించీ ||యేసయ్య నీ ప్రేమ||


2. ఏనాడు నన్ను విడనాడలేదు - నీ నీడలోనే నడిపించినావు
లోకాలనేలే రారాజు నీవే - నా జీవనావకు రహదారి నీవే నా గురి నీవే నా యేసుదేవా - చేరితి నిన్నే నా ప్రాణనాథా
పర్వత శిఖరం నీ మహిమ ద్వారం - ఉన్నతమైనది నీ దివ్య చరితం సాటే లేరు నీకు - సర్వాథికారివి నీవు
మారని దైవం నీవు - మహిమోన్నతుడవు నీవు || యేసయ్య నీ ప్రేమ||

ANJALI GHATIYINCHINAMU 8K Song Lyrics|A Carnatic Classical Fusion | Pranam Kamlakhar | K Yohan Babu | Haricharan



అంజలి ఘటియించినాము అందరి మనసులలోని చీకటుల హరియించి తరియింప చేయగా నీ సుందర పదములముందర మేమందరము యేసు...
అంజలి ఘటియించినాము...
1.వాడుకగా వాక్యమును చదివితిమి గాని వాస్తవముగ దాని భావమే మరచితిమి ఆచారముగా ఆలయమేగితిమి గాని ఆచరణలో ఆజ్ఞలను విడచితిమి తుదకు వాక్యము నీవని ఎరిగితిమి నీ ఆలయముగా మేము మారితిమి ... యేసు అంజలి ఘటియించినాము... 2.వేదనలో నీ వేదమునే తలచి వేడుకలో నీ నామమే మరచి స్వార్ధ చింతనతో స్వామి నిను విడచి విలపించి తలవంచి
అంజలి ఘటియించినాము...