Pages - Menu

Pages

Saturday, June 25, 2022

Yesayya Nee Prema Naa Sonthamu Song Lyrics/Sireesha B/Joshua Shaik/Pranam Kamlakhar/Telugu Christian Songs 2022



యేసయ్య నీ ప్రేమ నా సొంతము - నాలోన పలికిన స్తుతిగీతము
యేసయ్య నీవేగ తొలికిరణము - నాలోన వెలిగిన రవికిరణము
ఏనాడు ఆరని నా దీపము - నా జీవితానికి ఆధారము
ఇమ్మానుయేలుగా నీ స్నేహము - నాలోన నిత్యము ఒక సంబరం


1. ఏపాటి నన్ను ప్రేమించినావు - నీ ప్రేమలోనే నను దాచినావు
నా భారమంతా నువు మోసినావు - నన్నెంతగానో హెచ్చించినావు
నీ కృపలోనే నను కాచినావు - నీ కనికరమే చూపించినావు
నా హృదిలోనే నీ వాక్యధ్యానం - నా మదిలోనే నీ నామస్మరణం నిన్నే ఆరాధించి - నీ దయలో నే జీవించి
నిన్నే నే పూజించి - నీలో నే తరియించీ ||యేసయ్య నీ ప్రేమ||


2. ఏనాడు నన్ను విడనాడలేదు - నీ నీడలోనే నడిపించినావు
లోకాలనేలే రారాజు నీవే - నా జీవనావకు రహదారి నీవే నా గురి నీవే నా యేసుదేవా - చేరితి నిన్నే నా ప్రాణనాథా
పర్వత శిఖరం నీ మహిమ ద్వారం - ఉన్నతమైనది నీ దివ్య చరితం సాటే లేరు నీకు - సర్వాథికారివి నీవు
మారని దైవం నీవు - మహిమోన్నతుడవు నీవు || యేసయ్య నీ ప్రేమ||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.