Halaman

Pages - Menu

Pages

Thursday, August 25, 2022

NANNU BALAPARACHU YESU NANDHE SONG LYRICS|ANNI SADHYAME YESULO | HADLEE XAVIER | KRANTHI CHEPURI | NEW TELUGU CHRISTIAN SONGS | 4K



నన్ను బలపరచు యేసునందే నేను

సర్వము చేయగలను

నన్ను స్థిరపరచు క్రీస్తునందే నేను

సమస్తం చేయగలను

సాధ్యము కానిది ఏదియు లేదే

అన్ని సాధ్యమే యేసులో

సాధ్యము కానిది ఏదియు లేదే

అన్ని సాధ్యమే క్రీస్తులో ||నన్ను బలపరచు||



1. నీటిని చీల్చి - బాటను వేసి - నరులను నడిపించెనే

బండను చీల్చి - దాహము తీర్చ - నీటిని పుట్టించెనే

నీటిని ద్రాక్షా రసముగ మార్చెనే

నీటిపై నడిచెనే - నీటినే అణచెనే

నా కన్నీటిని నాట్యముగ మార్చెనే

జీవ జలమైన నా యేసయ్యా... ||సాధ్యము||



2. హోరేబు కొండపై - మండే పొద నుండి - మోషేతో మాట్లాడెనే

బలిపీఠముపై - అగ్నిని కురిపించి - మహిమను కనుపరచెనే

షద్రకు మేషాకు అబేద్నెగోలను

అగ్నిలో ఉండియే కాపాడెనే

నరకపు మంటనుండి నను రక్షించిన

అగ్ని నేత్రాల నా యేసయ్యా... ||సాధ్యము||

OOHINCHALENU PRABHU SONG LYRICS | Joshua Shaik | Pranam Kamlakhar | Anwesshaa | New Telugu Christian Songs 2022



ఊహించలేను ప్రభూ నీ మమతను

వివరించలేను యేసు నీ ప్రేమను

నువు లేక ఇలలో నేను బ్రతికేదెలా

ఎనలేని నీ ప్రేమను కొలిచేదెలా



1. ఈ లోక గాయాలతో నిను చూడగా

లోతైన నీ ప్రేమతో కాపాడగా

కొరతంటు లేదే ప్రభూ నీ కరుణకు

అలుపంటు రాదే సదా నీ కనులకు

ప్రతీ దినం ప్రతీ క్షణం

నీ ప్రేమ లేకపోతే నిరుపేదనూ ||ఊహించలేను||



2. నాలోని ఆవేదనే నిను చేరగా

నా దేవ నీ వాక్యమే ఓదార్చగా

ఘనమైన నీ నామమే కొనియాడనా
విలువైన నీ ప్రేమనే నే పాడనా

ఇదే వరం నిరంతరం

నీతోనే సాగిపోనా - నా యేసయ్య ||ఊహించలేను||

Wednesday, August 17, 2022

Na Thodu Neevu Nilachithive Song Lyrics | Latest Telugu Christian Song 2022 | Chrisostam |

 

 
 
నాతోడు నీవు నిలచితివే 
నీ ప్రేమ నాపై చూపితివే ||2|| 
నను వెంటాడే నీ కృప క్షేమములే 
నను కాచే నీ కరుణ కటాక్షములే ||2||
 
యేసయ్య నీకే స్తోత్రము... ||4||  
 
 
1. అగ్ని గుండములో సింహపు బోనులో 
నను రక్షించు వారెవరు లేక 
నే ఒంటరినైయున్న వేళా 
నిలిచావు నాకై తోడుగా 
నిలిపావు నన్ను నీదు సాక్షిగా 
నను చేసావు నీ రక్షణకే రుజువుగా 
 
యేసయ్య నీకే స్తోత్రము... ||4||  
 
 
2. అనారోగ్యములో వ్యాధిబాదలో 
నను స్వస్థపరచు వారెవరులేక 
నే వేదనలో క్రుంగియున్న వేళా 
తాకావునన్ను నీ చేతితో 
 స్వస్థ పరచావు నన్ను నీదు వాక్కుతో 
నను చేసావు నీ ప్రేమ్మతో పరిపూర్ణముగా 
 
యేసయ్య నీకే స్తోత్రము... ||4||
 
 
 
 

Chuchuchunna Devudavayya Old Song Lyrics || Telugu Christian Songs Lyrics



చూచుచున్న దేవుడవయ్యా

నన్ను చూచినావునీ పేరు మిటో ఎరుగనయ్యా (2)

నా పేరుతో నన్ను పిలిచావయ్యా (2) ||చూచుచున్న||



1. శారాయి మాటలే విన్నాను

అబ్రహాము భార్యనై య్యాను (2)

ఈ అరణ్య దారిలో ఒంటరినై (2)

దిక్కులేక తిరుగుతున్న హాగరును

నేను హాగరును ||చూచుచున్న||



2. ఇష్మాయేలుకు తల్లినైతిని

అయినవారితో త్రోసివేయబడితిని (2)

కన్నకొడుకు మరణము చూడలేక (2)

తల్లడిల్లిపోతున్న తల్లిని

అనాథ తల్లిని ||చూచుచున్న||



3. పసివాడి మొరను ఆలకించావు

జీవజలములనిచ్చి బ్రతికించావు (2)

నీ సంతతిని దీవింతునని (2)

వాగ్దానమిచ్చిన దేవుడవు

గొప్ప దేవుడవు ||చూచుచున్న||

Saturday, August 13, 2022

Yentha Krupamayudavu Yesayya Song Lyrics | ఎంత కృపామయుడవు యేసయ్య |



ఎంత కృపామయుడవు యేసయ్యా – ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా ||2||

నలిగితివి వేసారితీవి – నలిగితివి వేసారితీవి ||2||

నాకై ప్రాణము నిచ్చితివి – నాకై ప్రాణము నిచ్చితివి ||2||



1. బండ లాంటిది నాదు మొండి హృదయం- ఎండిపోయిన నాదు పాప జీవితం ||2||

మార్చితివి నీ స్వాస్త్యముగ ||2|| – ఇచ్చినావు మెత్తనైనా కొత్తహృదయం ||2|| ||ఎంత||



2.వ్యాధి బాధలందు నేను క్రుంగీయుండగా – ఆదరించెను నీ వాక్యము నన్ను ||2||

స్వస్ఠపరచెను నీ హస్తము నన్ను||2|| - ప్రేమతో పిలచిన నాధుడవు ||2|| ||ఎంత||



3.కన్న తల్లి తండ్రులు నన్ను విడచినను – ఈ లోకము నను వెలివేసిన ||2||

మరువలేదు నన్ను విడువలేదు ||2|| – ప్రేమతో పిలచిన నాధుడవు ||2|| ||ఎంత||



4.ఆదరణ లేని నన్ను ప్రేమించితివి- అభిషేకించితివి ఆత్మలోను ||2||

నిలచుటకు ఫలించుటకు ||2|| – అత్మతో నను ముద్రించితివి ||2|| ||ఎంత||

NEE CHARANAMULE NAMMITHI | ANDHRA KRAISTAVA KEERTHANALU


నీ చరణములే నమ్మితి నమ్మితి

నీ పాదములే పట్టితి (2)            ||నీ చరణములే||



1. దిక్కిక నీవే చక్కగ రావే (2)

మిక్కిలి మ్రొక్కుదు మ్రొక్కుదు మ్రొక్కుదు            ||నీ చరణములే||



2. ఐహిక సుఖము – నరసితి నిత్యము (2)

ఆహాహా ద్రోహిని ద్రోహిని ద్రోహిని            ||నీ చరణములే||



3. న్యాయము గాని – నా క్రియలన్ని (2)

రోయుచు ద్రోయకు త్రోయకు త్రోయకు            ||నీ చరణములే||



4. న్యాయము గాని – నా క్రియలన్ని (2)

రోయుచు ద్రోయకు త్రోయకు త్రోయకు            ||నీ చరణములే||



5. భావము మార్చి – నావెత దీర్చి (2)

దేవర ప్రోవవే ప్రోవవే ప్రోవవే            ||నీ చరణములే||



6. చంచల బుద్ధి – వంచన యెద్ది (2)

ఉంచక త్రుంచవే త్రుంచవే త్రుంచవే            ||నీ చరణములే||



7. చుర్రుకొని యున్న – శోధనలున్న (2)

పట్టు విడ గొట్టవే కొట్టవే కొట్టవే            ||నీ చరణములే||



8. నాచు పిశాచి – నరుకుట గాచి (2)

కాచుకో దాచవే దాచవే దాచవే            ||నీ చరణములే||



9. యేసుని తోడ – నెవ్వరు సాటి (2)

దోసము బాపును బాపును బాపును            ||నీ చరణములే||

Vaddu Vaddu Oranna Song Lyrics | Christian folk song


వద్దు వద్దు వద్దు వద్దు వద్దు వద్దు వద్దు ఓరన్నా

ఈ పులుముకున్న భక్తివద్దురా ఓరన్నా 

గడ్డి పూవులాంటి భక్తివద్దురా ఓరన్నా 



1. తెల్లబట్టలేసుకున్నావు పెద్దబైబిల్ పట్టుకున్నావ్ 

ప్రార్థన గుంపులకొచ్చి పొడుగు ప్రార్థన చేసినావు 

గల్లీగల్లీకి నీ సాక్ష్యం గంభిరంగా చెప్పినావు

ఇంటికాడ నీ సాక్ష్యం ఇంతమంచిగున్నద  ||వద్దు వద్దు||



2. ఆఫీసులేట్లున్నావ్ అంగట్లో ఎట్లున్నావ్ 

నాటుకడెట్లున్నావ్ కోతకాడెట్లున్నావ్

బస్టాపులెట్లున్నావ్ బస్తీలో ఎట్లున్నావ్  ||వద్దు వద్దు||



3. మందిరంలో ఉన్నప్పుడు మాదిరిగౌపిస్తావ్

మందిరంలో కెళ్ళివచ్చినాక మందు గొట్టితిరుగుతావు 

వద్దువద్దు వద్దు ఒరన్న ఈ గుళ్లోతీరు బైతో తీరు ఒద్దు ఓరన్నా

ఈ పులుముకున్న భక్తసలే ఒద్దు ఓరన్నా....ఓచెల్లే ||వద్దు వద్దు||



4. కష్టాలొచ్చినప్పుడు ఎస్సయ్యని ఏడుస్తావు 

తలపోటోచినప్పుడు తండ్రియని ఏడుస్తావు 

కష్టాలన్నీ తీరినంక ఏటిగట్టెక్కుతావు యేసేవ్వడంటావు ||వద్దు వద్దు||



5. ప్రభుకొరకు నేను ప్రాణమైన పెడ్తాఅంటివి 

బైబిల్ లెత్తి చెప్పినావు బాసాలెన్నో జేసినావు

పదిసినుకులు వర్షమొస్తే ప్రభు గుడికే రాకపోతివి

వద్దు వద్దు వద్దు వద్దు ఈ సగం సగం బ్రతుకొద్దురా ఓరన్నా

పూర్తి సమర్పణతో బతకావా ఓరన్నా  ||వద్దు వద్దు||

Andariki Kavali Yesaiah Raktam folk Song Lyrics

                                                      

అందరికి కావాలి యేసయ్య రక్తము (2)

పాపము లేని పరిశుద్ధుని రక్తము

ఇది పాపుల కొరకై వొలికిన

పరమ వైద్యుని రక్తము (2)



1. కుల మత బేధం లేని రక్తము

అందరికి వర్తించే రక్తము (2)

కక్ష్య క్రోధం లేని రక్తము

కన్న ప్రేమ చూపించే రక్తము (2)  ||అందరికి||



2. కోళ్ళ రక్తముతో పాపం పోదు

ఎడ్ల రక్తముతో పాపం పోదు (2)

ఈ పాపము కడిగే యేసు రక్తము

సాకలి వాని సబ్బు వంటిది (2)   ||అందరికి||



3. చీకటి శక్తుల అణిచె రక్తము

రోత బతుకును కడిగే రక్తము (2)

రక్తములోనే ప్రాణమున్నది

పాపము కడిగే గుణమున్నది (2)

రక్తములోనే పవ్వరున్నది

స్వస్తపరిచే గుణమున్నది (2)   ||అందరికి||


Pailam Koduka song lyrics | Christian Folk song


పైలం కొడుకా పాపం చేయకురా

యేసయ్యను నమ్ముకొని మంచిగా బతుకురా

పైలం కొడుకా పైలం కొడుకా

పైలం కొడుకా పైలం కొడుకా

పైలం కొడుకా పాపం చేయకురా

యేసయ్యను నమ్ముకొని మంచిగా బతుకురా

నీ మనసు మార్చుకొని మంచిగా బతుకురా



1. ఉడుకు రక్తము ఉరుకలు పెడ్తది

పాపం చెయ్యమని ఒత్తిడి చేస్తది

పాపమన్నది పాములాంటిది

పగ పడ్తది ప్రాణం తీస్తది           ||పైలం||



2. మనిషి జీవితం విలువయ్యింది

మరువకు కొడుకా మరణమున్నదని

బ్రతికింది ఇది బ్రతుకు కాదురా

సచ్చినంక అసలాట ఉంటది          ||పైలం||


3. కత్తి కన్న పదునెక్కువ కొడుకా

మనిషి కోపము మంచిది కాదు

కాలు జారితే తీసుకోవచ్చురా

నోరు జారితే తీసుకోలేము          ||పైలం||



4. క్రైస్తవ జీవితం విలువయ్యింది

నిప్పులాగ బ్రతకాలిరా కొడుకా

నిప్పులాగ బ్రతకాలిరా కొడుకా

నిందలన్ని మొయ్యాలిరా కొడుకా          ||పైలం||



5. విచ్చలవిడిగా తిరుగుతున్నావు

ఎవరు చూడరని ఎగురుతున్నావు

చూసే దేవుడేసయ్య ఉన్నడు

తోలు తీస్తడు జాగ్రత్త కొడుకా        ||పైలం||



6. గుట్కలు తినకురా గుటుక్కున చస్తావు

పొగాకు తినకురా పోతవు నరకం

సినిమా చూడకు చింతలు తప్పవు

ఫోజులు కొట్టకు పోతవు నరకం         ||పైలం||



7. కుమ్మరి పురుగు గుణం చూడరా

బురదల ఉంటది బురదే అంటదు

తామెర పువ్వు బురుదల ఉంటది

వరదొస్తే తల వంచుకుంటది          ||పైలం||



8. ఎన్నో ఆశలు పెట్టుకున్నరా

సేవ చేస్తే నిను చూడాలని

నా కలలను కల్ల చెయ్యకు కొడుకా

కాళ్ళు మొక్కుతా మయ్యగానిరా          ||పైలం||



9. పొందుకున్నవు రక్షణ నీవు

పోగొట్టుకోకు పోతవు నరకం

నరకమంటే ఆషామాషీ కాదురో

అగ్ని ఆరదు పురుగు చావదు          ||పైలం||



10. ప్రపంచమంతటా పాపమున్నది

మందులేని మాయ రోగమున్నది

నీ పచ్చని జీవితం పాడు చేసుకోకు ఓ కొడకా

నీవు మంచిగా బ్రతికేసయ్యను మహిమపరచు నా కొడకా   ||పైలం||



11. నీవు సి ఎం అయితే సంతోషముండదు పి ఎం అయితే సంతోషముండదు

యాక్టర్ అయితే సంతోషముండదు డాక్టర్ అయితే సంతోషముండదు

నీవు సేవ చేస్తే నేను చూడాలి కొడుకా

నువ్వు శ్రమలు అనుభవించాలిరా నా కొడుకా          ||పైలం||

అమ్మలారా ఓ.. అక్కలారా Song Lyrics || Bro. Sailanna ||



అమ్మల్లారా ఓ అక్కల్లారా (2)

ఈ వార్త వినరండే

యేసయ్యను నమ్ముకొండే (2)



1. మానవ జాతి పాపము కొరకై (2)

కన్నీరు విడుస్తుండు

ప్రభు రమ్మని పిలుస్తుండు (2) ||అమ్మల్లారా||



2. లోకమంతటా యేసు రక్తము (2)

ఎరువుగ జల్లిండే

మరణపు ముల్లును విరిచిండే (2)

అమ్మల్లారా ఓ అక్కల్లారా (2)

ఓ పల్లె చెల్లెల్లారా

ఓ పట్నం అక్కల్లారా (2)



3. బట్టలు మార్చితే బ్రతుకు మారదు

గుండు కొడితే నీ గుణం మారదు

బతుకు మారడం బట్టల్ల లేదు

గుణం మారడం గుండుల లేదు

నీ మనసు మారాలన్నా

నీ బుద్ది మారాలన్నా

నీ మనసు మారాలక్కా

నీ బుద్ది మారాలక్కా ||అమ్మల్లారా||



4. పాపం లేని యేసు దేవుణ్ణి

నమ్ముకుందామమ్మా

దేవుడు మంచి దేవుడమ్మా (2)

అమ్మల్లారా ఓ అక్కల్లారా (2)

ఈ సత్యమినరండే

ఇది కల్ల కాదు చెల్లె

ఇది కల్ల కాదు తమ్మి

ఇది కల్ల కాదు తాత

ఇది కల్ల కాదు అవ్వ

ఇది కల్ల కాదు అన్న

ఇది కల్ల కాదు అక్క

srimanthuda yesayya na atmaku abhishekama Song Lyrics | Hosanna Song Lyrics



పల్లవి:
శ్రీమంతుడా యేసయ్యా

నా ఆత్మకు అభిషేకమా

నా అభినయ సంగీతమా



1.సిలువధారి నా బలిపీఠమా

నీ రక్తపు కోట నాకు నివాసమా

నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా

ఇదియే నీ త్యాగ సంకేతమా

||శ్రీమంతుడా||



2.మహిమగల పరిచర్య పొందినందున

అధైర్యపడను కృప పొందినందున

మహిమతో నీవు దిగి వచ్చువేళ

మార్పునొందెద నీ పోలికగా

||శ్రీమంతుడా||



3.సీయోను శిఖరము సింహాసనము

వరపుత్రులకే వారసత్వము

వాగ్దానములన్ని నేరవేర్చుచుంటివా

వాగ్దానపూర్ణుడా నా యేసయ్యా

||శ్రీమంతుడా||