Pages - Menu

Pages

Thursday, August 25, 2022

OOHINCHALENU PRABHU SONG LYRICS | Joshua Shaik | Pranam Kamlakhar | Anwesshaa | New Telugu Christian Songs 2022



ఊహించలేను ప్రభూ నీ మమతను

వివరించలేను యేసు నీ ప్రేమను

నువు లేక ఇలలో నేను బ్రతికేదెలా

ఎనలేని నీ ప్రేమను కొలిచేదెలా



1. ఈ లోక గాయాలతో నిను చూడగా

లోతైన నీ ప్రేమతో కాపాడగా

కొరతంటు లేదే ప్రభూ నీ కరుణకు

అలుపంటు రాదే సదా నీ కనులకు

ప్రతీ దినం ప్రతీ క్షణం

నీ ప్రేమ లేకపోతే నిరుపేదనూ ||ఊహించలేను||



2. నాలోని ఆవేదనే నిను చేరగా

నా దేవ నీ వాక్యమే ఓదార్చగా

ఘనమైన నీ నామమే కొనియాడనా
విలువైన నీ ప్రేమనే నే పాడనా

ఇదే వరం నిరంతరం

నీతోనే సాగిపోనా - నా యేసయ్య ||ఊహించలేను||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.