నా చేరువై నా స్నేహమై
నను ప్రేమించే నా యేసయ్య
నీ ప్రేమలోనే నేనుండిపోనీ
నీ సేవలోనే నను సాగనీ
నీ ధ్యాసలోనే మైమరచిపోనీ
నీ వాక్కు నాలో నెరవేరనీ
నా వరం నా బలం నీవే నా గానం
నా ధనం నా ఘనం నీవే ఆనందం
తోడుగా నీడగా నీవే నా దైవం
ఎన్నడూ మారనీ ప్రేమే నా సొంతం
1. నా వేదనందు - నా గాయమందు
నిను చేరుకున్నా - నా యేసయ్య
నీ చరణమందు - నీ ధ్యానమందు
నిను కోరుకున్నా - నీ ప్రేమకై
కరుణించినావు నను పిలచినావు
గమనించినావు ఘనపరచినావు
నీవేగా దేవా నా ఊపిరి
2. నా జీవితాన - ఏ భారమైన
నీ జాలి హృదయం - లాలించెనే
ప్రతికూలమైన - ఏ ప్రళయమైన
ప్రణుతింతు నిన్నే - నా యేసయ్య
విలువైన ప్రేమ కనపరచినావు
బలపరచి నన్ను గెలిపించినావు
నీవేగా దేవా నా ఊపిరి
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.