హల్లెలూయ యని పాడి స్తుతింపను - రారె
జనులారా మనసారా ఊరూర రారే జనులార నొరార ఊరూర   
1. పాడి పంటలనిచ్చి - పాలించి దేవుడని - కూడు గుడ్డల నిచ్చి    
పోషించు దేవుడని - తోడు నీడగ నిన్ను - కాపాడు దేవుడని    
పోషించు దేవుడని - తోడు నీడగ నిన్ను - కాపాడు దేవుడని ||హల్లెలూయ యని||
2. తాత ముత్తాతలకన్న - ముందున్న దేవుడని - తల్లి దండ్రులకన్న    
ప్రేమించు దేవుడని - కల్లాకపటములేని - కరుణ సంపన్నుడని    
పూజించి - పూజించి - పాటించి - చాటించ రారె ||హల్లెలూయ యని||
3. బందూ మిత్రులకన్నా - బలమైన దేవుడని - అన్నదమ్ములకన్న    
ప్రియమైన దేవుడని - కన్నబిడ్డలకన్న - కన్నుల పండుగని   
పూజించి - పూజించి - పాటించి - చాటించ రారె ||హల్లెలూయ యని||
4. రాజాధి రాజుల కన్న రాజైన దేవుడని - నీచాతి నీచులను    
 ప్రేమించవచ్చెనని - నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడని    
పూజించి - పూజించి - పాటించి - చాటించ రారె ||హల్లెలూయ యని||