Pages - Menu

Pages

Saturday, November 19, 2022

Sandhadi modhalaye Song Lyrics || Sandhadi4 (Joyful Noise) Christmas Folk song Lyrics






సందడి మొదలాయే మన యేసయ్య పుట్టాడని సందడి మొదలాయే మన రారాజు పుట్టాడని-2 బెత్లహేములో బలవంతుడు పుట్టినాడని సందడి
పశులశాలలో పరిశుధ్ధుడు పుట్టినాడని సందడి
మినుక్కుమంటు తళుక్కుమంటు చుక్కలు చేసే సందడి
హొసన్న అంటు పాటలు పాడి దూతలు చేసే సందడి-సందడి కన్య మరియ గర్భమందు పుట్టినాడమ్మ
రక్షకుడు పుట్టినాడమ్మ యేసయ్య పుట్టినాడమ్మ
అర్ధరాత్రి వేళలోన పుట్టినాడమ్మ
రారాజు పుట్టినాడమ్మ మహారాజు పుట్టినాడమ్మ-2 నీ కోసం నాకోసం పుట్టినాడమ్మ
పుట్టుడే మహా రాజుగా పుట్టినాడమ్మ
మార్గం సత్యం జీవం యేసయ్యే-సందడి తూర్పు దేశము నుండి జ్ఞానులు వచ్చినారమ్మ
తారను చూచినారమ్మ తార దారి చూపినాదమ్మ
బంగారు సాంబ్రాణి బోళము తెచ్చి ఇచ్చినారమ్మ
జ్ఞానులర్పించినారమ్మ యేసుకర్పించినారమ్మ-2 దూత వచ్చి శుభవార్త తెలిపినాదమ్మ
గొల్లలు గంతులు వేసి గానము చేసినారమ్మ
సాగిలపడి పూజించారమ్మ-సందడి కన్నీరు తుడిచి కంటిపాపల కాచేవాడమ్మ
కరుణామయుడమ్మ దయగలవాడమ్మ
కష్టాలలోన నష్టాలలోన తోడుండేవాడమ్మ
ఇమ్మానుయేలమ్మ తోడుంటాడమ్మ-2 పరమును విడిచి పరమాత్ముడే పవళించాడమ్మ
మానవాళికై మహిమను విడిచి భువికొచ్చాడమ్మ
మన పాపశాపములు తొలగించును అమ్మా-సందడి

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.