Pages - Menu

Pages

Sunday, January 22, 2023

నీ ధనము నీ ఘనము|Nee Dhanamu Nee Ghanamu Song with Lyrics | Andhra Kraisthava Keerthanalu Jesus Songs




నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే

నీ దశమా భాగమునీయ వెనుదీతువా – వెనుదీతువా ||నీ ధనము||



1. ధరలోన ధన ధాన్యముల నీయగా

కరుణించి కాపాడి రక్షింపగా (2)

పరలోక నాధుండు నీకీయగా

మరి యేసు కొరకీయ వెనుదీతువా ||నీ ధనము||



2. పాడిపంటలు ప్రభువు నీకీయగా

కూడు గుడ్డలు నీకు దయచేయగా (2)

వేడంగ ప్రభు యేసు నామంబును

గడువేల ప్రభుకీయ నో క్రైస్తవా ||నీ ధనము||


3. వెలుగు నీడలు గాలి వర్షంబులు

కలిగించె ప్రభు నీకు ఉచితంబుగా (2)

వెలిగించ ధర పైని ప్రభు నామము

కలిమి కొలది ప్రభున కర్పింపవా ||నీ ధనము||


4. కలిగించె సకలంబు సమృద్దిగా

తొలగించె పలుభాధ భరితంబులు (2)

బలియాయె నీ పాపముల కేసువే

చెలువంగ ప్రభుకీయ చింతింతువా ||నీ ధనము||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.