Pages - Menu

Pages

Sunday, January 22, 2023

Nee dhayalo Nee krupalo Song Lyrics|Jonah Samuel|D.Sujeev Kumar|Latest telugu christian song|Telugu worship song


నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము

నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంత

నీ సేవలో ఫలియింపగా

దేవా… దేవా… ||నీ దయ||


1. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేదించగా

ప్రాణ హితులే నన్ను విడచి వెలిగ నను చూడగ (2)

ఓదార్పువై నా చెంత నీవే ఉండినావు

నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు (2)

ఏమి అద్బుత ప్రేమయా ఏ రీతి పాడనయా

నీవె నా మార్గము – నీవె నా జీవము

నీవె నా గమ్యము – నీవె నా సర్వము

నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా ||నీ దయ||


2. ఏ యొగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి

వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి (2)

నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని

నీ సేవయే నా శ్వాసగా కడ వరకు నిలవాలని (2)

నా మది నిండెను ఆశతో నే పాడెద స్తుతి గీతం

నీవె నా తోడుగా – నీవె నా నీడగా

ఆత్మతో నింపుమా – శక్తి నా కొసగుమా

నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా ||నీ దయ||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.