Pages - Menu

Pages

Tuesday, March 7, 2023

Ni Rakthame Ni Rakthame Song Lyrics || Good Friday Songs || Siluva songs


నీ రక్తమే నీ రక్తమే నన్ శుద్దీకరించున్

నీ రక్తమే నా బలము (2)



1. నీ రక్త ధారలే ఇల

పాపికాశ్రయంబిచ్చును (2)

పరిశుద్ధ తండ్రి పాపిని

కడిగి పవిత్ర పరచుము (2) ||నీ రక్తమే||



2. నశించు వారికి నీ సిలువ

వెర్రితనముగ నున్నది (2)

రక్షింపబడుచున్న పాపికి

దేవుని శక్తియై యున్నది (2) ||నీ రక్తమే||



3. నీ సిల్వలో కార్చినట్టి

విలువైన రక్తముచే (2)

పాప విముక్తి చేసితివి

పరిశుద్ధ దేవ తనయుడా (2) ||నీ రక్తమే||



4. పంది వలె పొర్లిన నన్ను

కుక్క వలె తిరిగిన నన్ను (2)

ప్రేమతో చేర్చుకొంటివి

ప్రేమార్హ నీకే స్తోత్రము (2)  ||నీ రక్తమే||



5. నన్ను వెంబడించు సైతానున్

నన్ను బెదరించు సైతానున్ (2)

దునుమాడేది నీ రక్తమే

దహించేది నీ రక్తమే (2) ||నీ రక్తమే||



6. స్తుతి మహిమ ఘనతయు

యుగయుగంబులకును (2)

స్తుతి పాత్ర నీకే చెల్లును

స్తోత్రార్హుడా నీకే తగును (2)  ||నీ రక్తమే||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.