Pages - Menu

Pages

Tuesday, March 7, 2023

సందేహమేలా || Sandehamela Samsayamela Song Lyrics || N Michael Paul


సందేహమేల సంశయమదే

ప్రభు యేసు గాయములను పరికించి చూడు

గాయాలలో నీ వ్రేలు తాకించి చూడు (2) ||సందేహమేల||



1. ఆ ముళ్ల మకుటము నీకై – ధరియించెనే

నీ పాప శిక్షను తానే – భరియించెనే (2)

ప్రవహించె రక్త ధార నీ కోసమే

కడు ఘోర హింసనొందె నీ కోసమే (2) ||సందేహమేల||



2. ఎందాక యేసుని నీవు – ఎరగనందువు

ఎందాక హృదయము బయట – నిలవమందువు (2)

యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనా

యేసయ్య సిలువ సువార్త చులకనాయెనా (2) ||సందేహమేల||



3. ఈ లోక భోగములను – వీడజాలవా

సాతాను బంధకమందు – సంతసింతువా (2)

యేసయ్య సహనముతోనే చెలగాటమా

ఈనాడు రక్షణ దినము గ్రహియించుమా (2) ||సందేహమేల||




4. లోకాన ఎవ్వరు నీకై – మరణించరు

నీ శిక్షలను భరియింప – సహియించరు (2)

నీ తల్లియైన గాని నిన్ను మరచునే

ఆ ప్రేమ మూర్తి నిన్ను మరువజాలునా (2) ||సందేహమేల||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.