Pages - Menu

Pages

Sunday, March 5, 2023

Siluvalo - Aa Siluvalo Song Lyrics || సిలువలో - ఆ సిలువలో Song Lyrics| |Telugu Christian Song Lyrics | 2023

 
                                                                               

 
                                                           రచన: అంశుమతి మేరి


సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో
సిలువలో ఆ సిలువలో
ఆ ఘోర కల్వరిలో
తులువలా మధ్యలో వ్రేలాడిన యేసయ్యా ॥2॥
వెలియైన యేసయ్యా
బలియైన యేసయ్యా
నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా ॥2॥
॥సిలువలో॥

    


1. నేరం చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు
భారమైన సిలువ మోయలేక మోసావు
కొరడాలు చెళ్ళిని చీల్చెనే
నీ సుందర దేహమునే ॥2॥
తడిపెను నీ తనువునే రుధిరంపు ధారలు॥2॥
॥వెలియైన॥


॥సిలువలో॥



2. వధకు సిద్దమైన గొర్రెపిల్ల వోలే
మోమున ఉమ్మివేయ మౌనివైనావే
దూషించి అపహసించి హింసించిరా నిన్ను ॥2॥
ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా ॥2॥
॥వెలియైన॥

॥సిలువలో॥


3. నాదు పాపమె నిన్ను సిలువకు గురిచేసెన్
నాదు దోషమె నిన్ను అణువణువున హింసించెన్

    నీవు కార్చిన రక్తధారలే నా రక్షణాధారం ॥2॥
సిలువను చేరెదన్ విరిగిన హృదయముతోను॥2॥
॥వెలియైన॥

॥సిలువలో॥
    

    

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.