Pages - Menu

Pages

Monday, April 3, 2023

E Sayamkalamuna Yesu Prabho Song Lyrics || Andhra Kraisthava Keerthanalu || Christian Telugu Songs Lyrics



ఈ సాయంకాలమున యేసు ప్రభో వేఁడెదము

నీ సుదయారస మొల్క నిత్యంబు మముఁగావు ||ఈ ||



1. చెడ్డ కలల్ రాకుండ నడ్డగించుమి ప్రభో

బిడ్డలము రాత్రిలో భీతి బాపుము తండ్రీ ||ఈ ||


2. దుష్టుండౌ శోధకునిఁ ద్రొక్కుటకు బలమిమ్ము

భ్రష్టత్వమున మేము పడకుండఁ గాపాడు ||ఈ ||


3. నీ యేక పుత్రుండౌ శ్రీ యేసు నామమున

సాయం ప్రార్థన లెల్ల సరగ నాలించుమా ||ఈ ||


4. జనక సుత శుద్థాత్మ ఘనదేవా స్తుతియింతుం

అనిశము జీవించిరా జ్యంబుఁ జేయు మామేన్ ||ఈ||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.