కళ్ళ ముందు కరిగిపోవురా
కళ్ళ ముందు కరిగిపోవురా జీవితం ఆశాశ్వతం
లోలమందు ఏది నీది రా జ్ఞాపకాలేగా శేషం
మేలు జ్ఞాపకమే కీడు జ్ఞాపకమే
మేలైనది చేయని నడవడి జ్ఞాపకమే
గతము జ్ఞాపకమే హితము జ్ఞాపకమే
పాతాలపు యాతన తరగని జ్ఞాపకమే
ఈ లోకం మాయే మాయే ఇది మాయే
మనిషి బ్రతుకులోన నీతి కారువాయే
1. సన్నపు నార వస్త్రము
ధరియించినది దేహము
జీవిత కాలపు సుఖము
ధనవంతుని జ్ఞాపకము
కుక్కల కంటే హీనము
ఆకలి దిగంబరత్వము
దేహము కురుపుల మయము
లజరుకది జ్ఞాపకము ||2||
ఇరువురు మరణపు వశము
ముగిసేను ఆయుష్కాలము
ఒకరికి తరగని సుఖము ఒకరిది నిత్యనరకము
||కళ్ళముందు||
2. కొర్నేలి దానధర్మము
ప్రార్ధన భక్తి జీవితము
చేసిన ధర్మ కార్యము
దేవునికవి జ్ఞాపకము
సాక్షుల ఘన సమూహము
బ్రతుకున నీతి కార్యము
తండ్రికి అంగీకరము
ఫలితము నిత్య జీవము ||2||
విశ్వాసము ఖచ్చితము
లేకుంటే అసాధ్యము
దేవునికదే ఇష్టము
అపవిత్రులు నిషిద్ధము
||కళ్ళముందు||
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.