Pages - Menu

Pages

Thursday, May 11, 2023

Naa Deva Neeve Sadhaa Song Lyrics | Joshua Shaik | Pranam Kamlakhar | Sireesha B | Telugu Christian Songs 2023

నా దేవా నీవే సదా


నా దేవా నీవే సదా - నా తోడు నీవే కదా
ఇన్నాళ్ళ నీ ప్రేమ - నే మరతునా

వింతైన ఆ ప్రేమ - కొనియాడనా


1. నా దేవ నీ ప్రేమ - ఉదయించె నాలో
నీ పిలుపు నా కోసం - చిగురించె నాలో
ఎనలేని ఆనందం -  నీ నామ ధ్యానం 
    విలువైన నీ వాక్యం - నా ఆత్మ దీపం
     మనోహరా యేసయ్య - నా గురి నీవనీ 
     మరీ మరీ కోరాను - నీ ముఖ కాంతినీ
       నిరతము పాడనా - నీ స్తోత్ర గానం


2. సరిలేని నా మార్గం - మలిచావు నీవు 
    చిరకాల నీ స్నేహం - కురిపించినావు
ఇలలోన ఆధారం - కనిపించె నీలో
కరుణించు నా దైవం - తరియింతు నీలో
మనోహరా యేసయ్య - నా జత నీవనీ
మరీ మరీ కోరాను - నీ ముఖ కాంతినీ
నిరతము పాడనా - నీ స్తోత్ర గానం

1 comment:

Suggest your Song in the Comment.