నీ కృపలో నన్ను దాచావు యేసయ్య- యేసయ్య
నేను బ్రతికి ఉన్నానంటే నీ దయ నీ దయ ||2||
నీ జీవమే నాలో ఉండగా నాకు భయమే లేదయ్య
నా తండ్రిగా నీవు ఉండగా నాకు కోరత లేదయ్య
నీ తోడు నాకు ఉంటే చాల య్య చాలయ్య
ఏదైనా సాధ్యమే నీతో యేసయ్య- యేసయ్య-
1. ఏ త్రోవ లేకున్నా నిరాశలో ఉన్న
నీ జీవ వాక్యముతో నను నడుపుము యేసన్న ||2||
దయచూపుమా దీవించుమా
సమృద్ధి జీవంతో తృప్తిపరచుమా ||2||
2.పేరు ప్రాఖ్యతలు ఉన్నా సంపదలు ఉన్నా
నీ కృప లేకపోతే అన్నియు వ్యర్థమే ||2||
నీ కనికరం నీ కరుణ
జీవితానికి చాలు యేసయ్య ||2||
3. కనురెప్పపాటైనా నను విడువని యేసయ్య
నీ సేవ చేయుటకె జీవిస్తానయ్య ||2||
నా ప్రార్థన ఆలకించుమా
పరిపూర్ణమైనదానిగ అభిషేకించుమా ||2||
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.