Pages - Menu

Pages

Saturday, June 17, 2023

NYAYADHIPATHI AINA DEVUDU SONG LYRICS | NYAAYAADHIPATHI SONG LYRICS | ENOSH KUMAR | HADLEE XAVIER | KRANTHI CHEPURI | NEW TELUGU CHRISTIAN SONG | 4K

న్యాయాధిపతియైన దేవుడు


న్యాయాధిపతియైన దేవుడు - నిన్ను పిలిచే వేళలోన

ఏ గుంపులో ఉంటావో తెలుసుకో -

మరలా వచ్చే వేళలోన (2)

ఒక గుంపేమో పరలోకపు గుంపు

రక్షింపబడిన వారికే అది సొంతం

మరు గుంపేమో ఘోర నరకపు గుంపు

నిజ దేవుని ఎరుగని వారికి అది అంతం

||న్యాయాధిపతి||



1. నీవు కాదు నీ క్రియలు కాదు -

ఆ పరముకు నిను చేర్చేది

కాదు కాదు వేరెవరో కాదు - మరణమును తప్పించేది (2)

కలువరిలో తన ప్రాణం పెట్టిన

యేసయ్యే నీ ప్రాణ రక్షణ

సిలువలో క్రయ ధనమే చెల్లించిన

ఆ ప్రభువే నీ పాప విమోచన ||ఒక గుంపేమో||



2. ఇదియే సమయం ఇక లేదే తరుణం -

నీ పాపము ఒప్పుకొనుటకు

ఆ పరలోకం చేరే మార్గం - యేసేగా ప్రతి ఒక్కరకు (2)

మేఘముపై రానైయున్నాడుగా

త్వరలోనే నిను కొనిపోడానికి

వెనుదీయకు ఓ నా ప్రియ నేస్తమా

నీ హృదిలో స్వీకరించడానికి ||ఒక గుంపేమో||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.