Pages - Menu

Pages

Wednesday, February 14, 2024

YE REETHIGA SONG LYRICS | Joshua Shaik Songs | Pranam Kamlakhar Songs | Anwesshaa | Budapest |NEW Telugu Christian Song 2024 Lyrics

ఏ రీతిగా


ఏ రీతిగా కొలిచెద - ప్రభు నీ సేవలో నిలిచెద
ఇదే ఆశ మదిలో అనుదినం
ఇదే నా ప్రపంచం అనుక్షణం
సదా యేసు నీలో బ్రతికెద ఏ రీతిగా కొలిచెద - నీ ప్రేమలో నిలిచెద
ఇదే ఆశ మదిలో అనుదినం
ఇదే నా ప్రపంచం అనుక్షణం
సదా యేసు నీలో బ్రతికెద
ఏ రీతిగా కొలిచెద - ప్రభు నీ ప్రేమలో నిలిచెద

1. నీ మమతే - అమూల్యమైనదీ
ఊహలకే - అతీతమైనదీ
నా గతం - ఓడించగా
నీ దరే - చేరానుగా
పాపములో నన్ను - విడనాడక
విమోచించినా - నిజ దైవమా
ప్రార్ధనలే నాలో - ఫలియించగా
ప్రతీ శ్వాసలో - ప్రభవించవా నీ ప్రేమ ఇలలో - పాడెద - నిరతం దేవా

2. నీ వరమే - విశేషమైనదీ
వాక్యముగా - వసించుచున్నదీ
నీ స్వరం - నా దీపమై
నీ బలం - ఆధారమై
ఆశ్రయమైనావు - కలకాలము
కృపాసాగరా - స్తుతి పాత్రుడా
శాశ్వత నీ ప్రేమ - వివరించుట
ఎలా సాధ్యమూ - ప్రియ యేసయా

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.