Pages - Menu

Pages

Thursday, March 7, 2024

Nuthanamaina Krupa Song Lyrics ॥ Hosanna Ministries 2024 New Album Song-1|| Hosanna Ministries Song Lyrics|| Pas.JOHN WESLEY Songs

నూతనమైన కృప 



నూతనమైన కృప నవ నూతనమైన కృప 

శాశ్వతమైన కృప బహు ఉన్నతమైన కృప 

నిరంతరం నాపై చూపిన - 

నిత్య తెజూడా యేసయ్య 

నీ వాత్సల్యమే నాపై చూపించిన   - 

నీ ప్రేమను వివరించనా 

నను నీ కోసమే ఇలా బ్రతికించిన  - 

జీవాధిపతి నీవయ్య 

ఇదే కదా నీలో పరవశం  - 

మరువలేని తియ్యని జ్ఞాపకం 

||నూతనమైన||



1. నా క్రయధనముకై - రుధిరము కార్చితివి 

                 ఫలవంతములై - తోటగా మార్చితివి  ||2||

ఫలితముకొరకైన - శోధన కలిగినను 

ప్రతిఫలముగ నాకు - ఘనతను నియమించి 

ఆశ్చర్యకరమైన అదరణ -  కలిగించి 

అన్నివేలలయందు   - ఆశ్రయమైనావు   

ఎంతగా కీర్తించినా  - నీ ఋణమే నే తీర్చగలనా 

ఇదే కదా నీలో పరవశం  - 

మరువలేని తియ్యని జ్ఞాపకం 
  
||నూతనమైన||



2. నీ వశమైయున్న - ప్రాణాత్మదేహమును
 
               పరిశుద్ధపరచుటయే - నీకిష్టమాయెను |2||

పలు వేదనలలో - నీతో నడిపించి 

తలవంచని తెగువ - నీలో కలిగించి  

మదిలో నిలిచావు - మమతను పంచావు 

నా జీవితమంతా - నిను కొనియాడెదను 

ఎంతగా కీర్తించిన - నీ ఋణమే నే తీర్చగలనా   

ఇదే కదా నీలో పరవశం  - 

మరువలేని తియ్యని జ్ఞాపకం 
  
||నూతనమైన||



3. సాక్షి సమూహము -మేఘమువలెనుండి 

       నాలో కోరిన - ఆశలు నెరవేరగా      ||2||

వేలాది  దూతల - ఆనందము చూచి 

కృప మహిమైశ్వర్యం - నే పొందిన వేళ 

మహిమలో - నీతోనే నిలిచిన వేళ 

మాధుర్య లోకాన - నిను చూచిన వేల 

ఎంతగా కీర్తించిన - నీ ఋణమే నే తీర్చగలనా   

ఇదే కదా నీలో పరవశం  - 

మరువలేని తియ్యని జ్ఞాపకం 
  
||నూతనమైన||



👇👇👇

SUBSCRIBE MY CHANNEL


No comments:

Post a Comment

Suggest your Song in the Comment.