నీవు తోడు ఉండగా
పల్లవి:
నీవు తోడైయుండగా యేసు భయము లేదు ఇలలో,
మేలు చేయు దేవుడా నీకు
సాటి లేరు సృష్టిలో.
ఎక్కలేని కొండలే ఎన్నో ఎదురొచ్చినా
లెక్కలేని నిందలే నన్ను బాధించినా
నీవు తోడైయుండగా యేసు భయము లేదు ఇలలో,
మేలు చేయు దేవుడా నీకు
సాటి లేరు సృష్టిలో.
1. గతం గాయాన్ని చేయగా
గాయం హృదయాన్ని చీల్చగా.
శోకం సంద్రంలా ముంచగా
లోకం బంధాలే తెంచగా.
పేరు పెట్టి తల్లిలా పిలిచి లాలించితివి.
నీవే తోడు నీడగా నిలిచి కృప చూపితివి!
I I నీవు తోడైయుండగా I I.
2. ఆశ నిరాశగా మారినా,
నిరాశ నిస్పృహ పెంచినా
యుక్తి తెలియక తిరిగినా
శక్తి క్షీణించి పోయినా.
వెన్ను తట్టి తండ్రిలా నిలిపి నడిపించితివి.
నీవే కొండ కోటగా నిలిచి బలపరచితివి!
I I నీవు తోడైయుండగా I I.
నీవు నాకు అండగా నిలిచి దారి చూపినావయ్యా!
నేను నీకు మెండుగా స్తుతులు అర్పించెదను.