హాయి హాయిగా
ఓ క్రొత్త పాటపాడి నా యేసయ్య ఎదుట ఉత్సాహంతో నేను ఆడనా
సంగీత గానముతో ఉత్సాహ ధ్వనులతో యేసయ్య కీర్తి చాటనా
హాయి హాయిగా నేను పాడనా
ఎల్లవేళల హల్లెలూయ పాట పాడనా
1. నాలోన ఒక ఆశ నిన్ను చూడాలని
నిన్ను చూసిన ఆ మధుర అనుభూతిని నిత్యం పాడాలని
నాలోని కోటి భావాలన్నీ నిన్ను గూర్చి పాడినా నా తనివి తీరదేశయ్య
నే బ్రతుకు కాలమంతా నిన్నే ప్రకటించి నా పయనమే ముగింతునేసయ్యా
2. శుద్ధుడవు ప్రేమ పూర్ణుడవు సాటిలేని వాడవు
లోక ప్రేమలన్నీ ఏకమైనా నీ ప్రేమకు సాటిరావు
ఈ భువి అంతా చుట్టు తిరిగి నీ ప్రేమను కొలిచినా కొలతకందనంత ప్రేమయా
నీ ప్రేమ కార్యములను వర్ణించి వ్రాసిన ఈ సృష్టి ఐన సరిపోదయ్యా
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.