ఆదరించుమయ్యా
॥పల్లవి|| ఆదరించుమయ్యా ఆదుకొనేవాడా
చేరదీయుమయ్యా సేదదీర్చేవాడా
యేసయ్య యేసయ్య నీ మీదే నా ఆశయ్య
1. రెక్కలే విరిగినా గువ్వనై నే వొరిగినా
ఎండలో వాడినా పువ్వునై నే రాలినా
దిక్కు తోచక నిన్ను చేరితి
కాదనవని నిన్ను నే వేడితి
నను దర్శించుమో యేసయ్య ||2||
నను ధైర్యపరచుమో నా యేసయ్యా
2. ఆశలే అడుగంటెనే నిరాశలే ఆవరించనే
నీడయే కరువాయెనే నా గూడుయే చెదరిపోయెనే
నీ తోడు నే కోరుకొంటిని
నీ పిలుపుకై వేచియుంటిని
నీ దరిచేర్చుకో- యేసయ్య ||2||
నన్ను కాదనకుమా నా యేసయ్యా
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.