Pages - Menu

Pages

Monday, August 19, 2024

Suvarthe Parishkaram Song Lyrics | Latest Telugu Christian Song |Suresh Vanguri, John Pradeep

సువార్తే పరిష్కారం



అపాయం అంత్యకాలం చుట్టూరా అంధకారం
వికారం భ్రష్ఠలోకం సమస్తం మోసకారం
సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం
సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం


1. సువార్త సారం తెలిసుండీ
నిస్సార సాక్ష్యం మనదేనా ||2||
పరలోక వెలుగును కలిగుండీ
మరుగైన దీపం మనమేనా
ఇకనైనా లేవరా ఎలుగెత్తి సత్యాన్ని ప్రకటించరా
ఇప్పుడైనా కదలవా లోకాన్ని ఎదిరించి పోరాడవా
సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం
సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం


2. జాతివిద్వేషపు జాడ్యంలో
మతోన్మాద విషమౌఢ్యంలో ||2||
దేశం ఆరని జ్వాలాయె
సంఘం హింసలపాలాయె || ఇకనైనా లేవరా॥

3. అబద్ద బోధల మోసాలు
అణగారుతున్నవి సంఘాలు ||2||
వేలకువేల కుటుంబాలు
నశించిపోతున్నవి చూడు || ఇకనైనా లేవరా॥

4. జెండరు గందరగోళాలు
లింగద్రవత్వపు ఘోరాలు ||2||
సందిగ్ధంలో నేటితరం
సంక్షోభంలో మనిషితనం || ఇకనైనా లేవరా॥

5. బహుళ సవాళ్ళను ఎదురుకొని
ఐక్యత బంధం నిలుపుకుని ||2||
రేపటి తరాన్ని శిష్యులుగా
నిలిపే బాధ్యత మనదేగా || ఇకనైనా లేవరా॥

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.