Pages - Menu

Pages

Friday, September 20, 2024

KANNITITHO NINDINA GUNDETHO SONG LYRICS || Latest Telugu Christian Song Lyrics|| Rajesh Joshua, Moses Dany Bro.P.James

కన్నీటితో నిండిన గుండెతో


కన్నీటితో నిండిన గుండెతో
అలసిన - సోలిన - కూలిన నేస్తమా ||2||
యేసే.. నిజ రక్షకుడై నిన్ను పిలువగా
యేసే విమోచకుడై నిన్ను పిలువగా ||2||
నీవు రక్షణ పొందేదవు; నీవు విడుదల పొందేదవు

విమోచన నొందేదవు నిశ్చయము...||2||


1. వేదనతో ప్రార్థించిన; హృదయమును కుమ్మరించిన

ఆవేదన అనుభవించిన హన్నా జీవితములో.. ||2||
ఆశీర్వాదింపబడెను ఫలభరితముగా మారెను

ఆవేదనలన్నీ అదృశ్యమాయెను ||2||
యేసయ్య సన్నిధిలో నీవు మోకరిల్లగా
యేసయ్య సన్నిధిలో కన్నీరు విడువగా ||2|| నీవు రక్షణ పొందేదవు; నీవు విడుదల పొందేదవు

విమోచన నొందేదవు నిశ్చయము...||2||


2. శాపగ్రస్త దేశము నుండి; వాగ్దాన ప్రజలకై

తీర్మానం చేసిన రూతమ్మ జీవితములో ||2||
హెచ్చింపునొందెను దీవెనగా తీర్చబడెను
యూదా గోత్రములో ఘనురాలు ఆయెను ||2||
యేసయ్య సన్నిధిలో తీర్మానం చేయగా
యేసయ్య సన్నిధిలో నీవు నమ్మకముంచగా ||2|| నీవు రక్షణ పొందేదవు; నీవు విడుదల పొందేదవు

విమోచన నొందేదవు నిశ్చయము...||2||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.