ఒంటరినై
ఒంటరినై నేనుండగా వేయిమందిగ నను మార్చినావు
ఎన్నికలేని నన్ను బలమైన పనిముట్టుగా
ననువాడుకో నా యేసయ్య నీ సేవలో నను వాడుకో
ననువాడుకో నా యేసయ్య పరిచర్యలో నను వాడుకో ॥2॥
|| ఒంటరినై ॥
1.షిత్తీములో ప్రజలు వ్యభిచారము చేయగా నీ కోపము
రగులుకొని తెగులును పంపితివి
నీవు ఓర్వలేనిదానిని తాను ఓర్వలేకపోవుచు
నీ యందు ఆసక్తి చూపిన ఫినేహాసులా
॥ననువాడుకో॥
2. ఆనాటి ప్రజలందరితో తన సాక్ష్యము చెప్పుచు
ఎవని యొద్ద సొమ్మును నేను ఆశించలేదని
ప్రార్ధన మానుట వలన పాపమని ఎంచుచు
శ్రేష్ఠమైన సేవ చేసిన సమూయేలులా
॥ ననువాడుకో॥
3. నా జనులు చేయుచున్న పాపములు చూడగా
నా కళ్ళు కన్నీటితో క్షీణించుచున్నవి
కన్నీటి ప్రార్ధనతో ప్రజల యొక్క విడుదలకై
ప్రార్ధనతో పోరాడిన యిర్మియాలా
॥ ననువాడుకో॥
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.