Halaman

Pages - Menu

Pages

Saturday, November 23, 2024

Neevu leni Kshanamu Song Lyrics | Latest Telugu Christian songs 2024| sis lillian Christopher| Anil kumar

నీవు లేని క్షణము


నీవు గాక నాకెవరున్నారయ్యా
నీవు లేని క్షణము నీ బ్రతుకగలనా
నీవులేని ఈజీవితం ఎండినఎడారి నా బ్రతుకు
ఆధారంము నీవే యెసయ్యా
ఆశ్రయము నీవే నాయెసయ్యా
నాబలము నీవే యెసయ్యా
నా బంధము నీవే నాయెసయ్యా

1. ఒంటరినై నేను మిగిలిపోయినా
ఓదార్పు లేక ఒరిగిపోయినా
రక్త బంధమే నను మరచిన
నానుఎన్నడు మరువని నా దేవుడవు


2. నిరాశలే ఎన్నోనో ఎదురైనా
నిటుర్పులే మిగిలినా
కన్నీరే నన్ను కృంగదీసిన
నను ధైర్య పరచిన నా దేవుడవు


3. అపదలే నన్ను అవరించినా
మరణ చాయలే నన్ను ఆలముకున్ననూ
ఎదనిండు వెదన నిండిపోయినా
నను ఆదరించిన నా దేవుడవు

Emmanuelu Baludu Song Lyrics || New Telugu Christmas Song 2024 || Vagdevi | Akshai Kumar Pammi | Bible Mission TV

ఇమ్మానుయేలు బాలుడు


ఇమ్మానుయేలు బాలుడు
సొగసైన సౌందర్య పుత్రుడు [2]
మహిమనే విడిచాడు మార్గమై వచ్చాడు
సర్వమానవాళిని రక్షింపను (2)
ఆ బాలుడే యేసు బాలుడు
సర్వలోకానికి ఏకైక రక్షకుడు
ఆ బాలుడే క్రీస్తు బాలుడు
సర్వమానవాళి పాప పరిహారకుడు (2)


1. పరము నుండి దూతలు దిగివచ్చిరి
పాటలు పాడి ఆరాధించిరి (2)
గొల్లలేమో పరుగునోచ్చిరి
క్రీస్తుని చూసి సాగిలపడిరి…(2) ||ఆ బాలుడె ||


2. పాపుల పాలిట రక్షకుడు
రోగుల పాలిట ఘనవైద్యుడు (2)
నిన్ను నన్ను రక్షింపను
భూలోకమున ఉదయించెను (2) || ఆ బాలుడె ||


3. మహా మహిమ లోకమునకు మహిమ వారసుడిగా
నిన్ను నన్ను చేర్చ వచ్చెను (2)
రాజధిరాజుగ లోకాధికారిగా
త్వరలో మేఘాలపై రానైయుండె (2)

రండి రండి రారండి
పండుగ చేయను చేరండి
రండి రండి రారండి
సందడి చేయను చేరండి ||ఇమ్మానుయేలు||

Wednesday, November 20, 2024

Telugu Christmas Mashup 4.0 Song Lyrics || Telugu Christmas Songs 2023 || Latest telugu Christian Songs


Telugu Christmas Mashup 4.0


మన యేసు బెత్లెహేములో
చిన్న పశుల పాకలో పుట్టెన్
పాకలో పుట్టెన్ పాకలో పుట్టెన్
జ్ఞానులంతా చుక్క ద్వారా
యేసుని యొద్దకు వచ్చి యుండిరి
వచ్చి యుండిరి కానుక లిచ్చిరి


నరులా రక్షణ కోరి
పరలోకపు మహిమ విడచి
కరుణగల దేవుడిలలో
నరరూపుడైన దినము
ఆనందా శుభదినము
అందరికిదే దినము



బెత్లెహేము నందు కన్య గర్భమందు
పుట్టినాడు నేడు క్రీస్తు యేసు రాజు
దూత ద్వార గొల్లలు తారను జూచి జ్ఞానులు
వచ్చి యేసునారాధించిరి
మనమంత కూడి సంతోషించెదం
గీతములు పాడి సువార్త చాటెదం


ఇది క్రిస్మస్ ఇది క్రిస్మస్
మనం కలిసి పాడుదాం
ఇది క్రిస్మస్ ఇది క్రిస్మస్
భలే సందడి చేసేద్దాం



వార్తో సత్య శుభవార్త
వార్త నాలకించి గొల్ల బోయులార వినరే
పరముకో నరుని రూపమందునా
బీద కన్య గర్భమందు నాదుడుద్భవించెను
గొల్లల్లారా వెళ్లిరండి వేగమే
వెళ్లి లోక రక్షకుని వెదకిరండి అచ్చట


తూర్పు దిక్కు చుక్క బుట్టె
మేరమ్మ ఓ మరియమ్మా
చుక్కాన్ జూచి మేము వచ్చినాము
మ్రొక్కి బోవుటాకు
పశువుల పాకలోని బాలుడమ్మ

పాప రహితుడమ్మా
పాపాంబు బాపను పుట్టెనమ్మ

సత్య వంతుడమ్మా

Bethlehemulo a oorilo Song Lyrics || Aa Urilo Sandadi Song Lyrics | Latest Telugu Christmas Song 2024 | Rajkumar Jeremy | Uday Kiran Kati | LWC

ఆ ఊరిలో


బేత్లెహేములో ఆ ఊరిలో - సందడి

యేసు పుట్టిన ఆ పాకలో - సందడి

మరియ పుత్రుడు ఈ ధరణిలో - సందడి

దేవుని వరము కరుణించెను - సందడి

యూదుల రాజు నేడు పుట్టెను - సందడి

ప్రజలందరికీ వెలుగు కలిగెను - సందడి - 2

ఆడుదాము పాడుదాము ఓరన్నా

లోక రక్షకుడు పుట్టెను చూడన్నా - 2



1. అర్ధ రాతిరి ఆ పాలములో - సందడి

దూత వచ్చినా ఆ గడియలో - సందడి

దూత వార్తతో అ గొల్లలు - సందడి

యేసును చూడ బయలెల్లిరి - సందడి

దావీదు పురములోన రక్షకుడు - సందడి

రేడు జన్మించినాడు దీనుడై - సందడి

|| ఆడుదాము ||



2. తూర్పు దిక్కున ఆ నింగిలో - సందడి

చుక్క పుట్టెను బహు వింతగా - సందడి

జ్ఞానులందరూ ఆ చుక్కతో - సందడి

బేత్లెహేముకు విచ్చేసిరి - సందడి

బంగారము సాంబ్రాణి బోలము - సందడి

ఆయనకు మ్రొక్కి సమర్పించిరి - సందడి

|| ఆడుదాము ||



3. ఊరి ఊరికి మా ఊరికి - సందడి

వాడ వాడకు మా వాడకు - సందడి

ఇంటి ఇంటికి మా ఇంటికి - సందడి

పరమ పుత్రుడు దిగి వచ్చెను - సందడి

దివ్య దూతలు పాటలు పాడిరి - సందడి

దేవ దేవుని ఆరాధించుడి - సందడి || ఆడుదాము ||

Tuesday, November 19, 2024

NA YESAYYA SONG LYRICS | Calvary Temple New Song | #drsatishkumar | Latest Telugu Christian Songs 2024

నా యేసయ్య

పల్లవి : నా యేసయ్య నీ కృపను మరువలేనయ్య
నా యేసయ్య నీ దయలేనిదే బ్రతకలేనయ్య (2) నీ నామ స్మరణలో దాగిన జయము
నీ వాక్య ధ్యానములో పొందిన బలము (2) తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించేద (2) హా... ఆహా... హల్లెలూయ
హో... ఓహో... హోసన్నా (2) || నా యేసయ్య ||



1. నా గుమ్మముల గడియలు బలపరచితివి
నీ చిత్తములో ఆడుగులు స్థిరపరచితివి (2) నా సరిహద్దులలో నెమ్మదిని కలిగించి
నిన్ను వెంబడించే భాగ్యమునిచ్చితివి హా... ఆహా... హల్లెలూయ
హో... ఓహో... హోసన్నా (2)
|| నా యేసయ్య ||


2. నీ వాగ్ధనములెన్నో నెరవేర్చితివి
నీ రెక్కల నీడలో నను దాచితివి (2) నా భయభీతులలో నీ వాక్కును పంపించి
నిన్నే సేవించే గొప్ప భాగ్యమునిచ్చితివి హా... ఆహా... హల్లెలూయ
హో... ఓహో... హోసన్నా (2)
|| నా యేసయ్య ||

Karunathmude Song Lyrics| Paul Moses| Latest Telugu Christmas song 2024|Choreography Special Joyful Song

కరుణాత్ముడే


కరుణాత్ముడే కదిలొచ్చాడే

అరుణోదయుడై అరుదెంచాడే    ||2||

ఆశీర్వాదాలు మొదలాయెనే

చీకటి బ్రతుకులకు వెలుగాయెనే ||2||

పుడమే పులకింపగా  - జగమే తరియింపగా

నేను పాడెదా - కొనియాడేదా

నేను ఆడేదా - చిందాడేదా ||2||



1. లోక రక్షకుడే పరమును విడిచి వచ్చాడే

ఓ చిన్ని పాకలో పావనుడై పవలించాడే ||2||

ఆశ్చర్యమే, తన మహిమను విడిచి వచ్ఛాడే

ఇంకా కంఫర్మే నిత్య రాజ్యపు వారసులవ్వటమే

బంగారు సాంబ్రాణితో నా స్తుతి గానాలతో

నేను పాడెదా - కొనియాడేదా

నేను ఆడేదా - చిందాడేదా ||2||



2. కారణమే ఉంది కారణజన్ముని రాకకు

భూనివాసులందరిని పరమునకు చేర్చుటకు ||2||

ఇంకా సంబరమే, ఊరువాడంతా ఏకమై ఆడాలే

ఆర్భాటమే, చేయి చేయి కలిపి సువార్త చాటాలే

లోకమే ద్వేషించినా, బాధకు గురి చేసినా

నేను పాడెదా - కొనియాడేదా

నేను ఆడేదా - చిందాడేదా ||2||

Kalam Sampoornamainapudu Song Lyrics | IDI ASCHARYAME SONG LYRICS | Latest Telugu Christmas Song 2024 | Sharon Sisters,JK Christopher,Philip Gariki

ఇది ఆశ్చర్యమే


కాలం సంపూర్ణమైనపుడు యేసయ్య భువికొచ్చెను

తానే మనలను ప్రేమించి రక్షకుడై జన్మించెను

రాజాధి రాజైనను ఇలలో దాసునిగా జీవించెను

సత్యమును స్థాపించుటకు

దైవసుతునిగా ఉదయించెను

"ఇది ఆశ్చర్యమే - ఇది అద్భుతమే"

"ఆహా ఆనందమే - హాపీ హ్యాపీ క్రిస్మస్

"ఇది ఆశ్చర్యమే - ఇది అద్భుతమే"...
"ఆహా ఆనందమే - మెర్రి మెర్రి క్రిస్మస్



1. జ్ఞానులు సాగిలపడిరి - మ్రొక్కిరి ప్రభువుల ప్రభువును

అటువలె విశ్వసించుచు - పూజించెదం ప్రభు యేసును

సర్వోన్నతమైన స్థలములలోన - దేవదేవునికే మహిమ
తనకిష్టులైన ప్రజలందరికి - భూమి మీద సమాధానము



2. గొల్లలు దేవుని మాటను - గ్రహియించిరి దూత చెప్పగా

విధేయతే మనకు ముఖ్యము -

గ్రహియించుము దేవుని చిత్తము
వాక్యమైన దేవుడు శరీరధారిగా -

మన మధ్యలో నివసించెను

నమ్మి విశ్వసించుము కలుగు నిత్యజీవము -

యేసు క్రీస్తే లోకరక్షకుడు

Akasha Veedhullo Song Lyrics || Lokalanele Nadhudu Song Lyrics | Joshua Shaik | Pranam Kamlakhar | Aniirvinhya |Telugu Christmas Songs 2024

లోకాలనేలే నాధుడు


ఆకాశ వీధుల్లో ఆనందం - ఆ నింగి తారల్లో ఉల్లాసం
ఈ రేయి వెన్నెల్లో సంతోషం -

ఇల పొంగేను లోలోన సంగీతం
లోకాలకే రారాజుగా - యేసయ్య పుట్టాడుగా .. హేహెయ్


1. లోకాలనేలే నాధుడు వెలిసాడు నా మెస్సయ్య
దరిచేరినాడు దీనుడై ధరలోన నా యేసయ్య
ఇలలో జాడగా పలికిందిగా వింతైన ఓ తారక
మదిలో నిండుగా ఓ పండుగ తెచ్చాడు నా రక్షక
సదా దీపమై సంతోషమై పరమాత్ముడే ఈనాడే జన్మించె
అహా సంతోషమే మహదానందమే

ఇల వచ్చింది ఓ సంబరం
సమాధానమే ఇల నీ కోసమే దిగివచ్చిందిగా ఈ దినం

2. వాక్యమైన దేవుడేగా బాలుడై వచ్చెను
పాపమంతా తీసివేయ రక్షణే తెచ్చెను
వేడుకైన ఈ దినాన యేసునే వేడుకో
అంతులేని చింతలేని పరమునే పొందుకో
సదా తోడుగా నీ అండగా పరమాత్ముడే

ఈనాడే జన్మించె

Saturday, November 16, 2024

Panduga Cheddama Song Lyrics || Ratna Babu || Sandeep || Vagdevi || New Telugu Christmas Song 2024

పండుగ చేద్దామా


నీతి సూర్యుడు ఉదయించేన్
కారణ జన్ముడు కదిలోచెన్ ||2|| పాపము నుండి విడిపించేన్
నిన్ను నన్ను రక్షించేన్ ||2|| చేద్దామా..... పండుగ చేద్దామా
యేసు ప్రభుని ఆరాధిదామా ||2||



1 . గొల్లలు దూత వార్తను విని
రక్షకుడైనా యేసుని చూచి ||2||
లోకమంత ప్రచురణ చేసి

ఆనందముతో ప్రభుని స్తుతించి ||2||
అందుకే చేద్దామా ||2||


2. జ్ఞానులు దేవుని తారను చూచి
బాలుడు యేసుని యెద్ధకి వచ్చి ||2||
ఆనందముతో పూజలు చేసి
సంతోషముతో కానుకలు ఇచ్చి ||2||
కాబట్టి చేద్దామా ||2||

Thursday, November 14, 2024

Bethlahemu Oorilona Song Lyrics| Dhanunjay | New Latest Telugu Christmas Song 2024-25 #NewLatestChristmasFolkSong

బెత్లహేము ఊరిలోన


బెత్లహేము ఊరిలోన - పశువుల శాలలోన
శ్రీ యేసు జన్మించాడు - రక్షణ భాగ్యం తెచ్చాడు (2)
మనసారా ఆరాధిస్తూ - పాటలు పాడేదం

రారాజు పుట్టాడని - సందడి చేసేదం (2)
దివినేలే రారాజు - భువిలోన పుట్టాడు
లోకానికే సంభరం - గతిలేని మన కొరకు
స్థితి విడిచి పెట్టాడు - ఆహా ఎంతటి భాగ్యము (2)


1. చింతలేదు - బెంగలేదు యేసయ్య తోడుగా
ఇమ్మానుయేలుగా - ఇశ్రాయేలు దేవునిగా (2)
అనుదినము బలపరిచి నడిపిస్తాడు
చింతలన్నీ తొలగించి ఆదరిస్తాడు(2) ||దివినేలే||


2. వ్యాధిఅయిన బాధఅయినా - శోధన మరి
ఏదైనా
కన్నీటి లోయలో - కృంగిన వేళలో (2)
స్వస్థ పరిచి నిన్ను విడిపిస్తాడు
సమాధాన కర్తగా శాంతినిస్తాడు (2) ||దివినేలే||



3. పాపులను రక్షింప -ప్రభు యేసు జన్మించే
శాపమును తొలగింప - నరునిగ అరుదించే(2)
యేసయ్యకు నీ హృదయం అర్పించితే
నిజమైన శాంతి సమాధానమే (2) || దివినేలే ||

Saturday, November 9, 2024

Jagamantha Divya kanthitho Song LyricsII Latest Christmas Songs 2024 IIChristmas Song Lyrics || Nissy John II Jonah Samuel

జగమంతా దివ్య కాంతితో


జగమంతా దివ్య కాంతితో - ప్రకాశించే క్రీస్తు జన్మతో “2”

దేవుడే మానవుడై మన మధ్య నివశింప -

ప్రేమానురాగాలు పంచగ ఇలలో

పాపులను రక్షింప ప్రాణమునే అర్పింప -

పావనుడే ఈ భువికి వచ్చు వేళలో “2”



1. చీకటి నిండిన పాపము పండిన -

లోకమునెంతో ప్రేమించెను

త్రోవ తప్పిన దేవుని విడిచిన -

పాపిని ఎంతో క్షమించెను “2”

లోక పాపములు మోయు గొర్రెపిల్లగా క్రీస్తు -

శిలువలో మరణించి పాపమునే తొలగించే

లోకమును వెలిగింప క్రోవుత్తుల కరిగే -

బ్రతుకు చీకటిని పారద్రోలేను

వేవేల కాంతులతో నిండెను బ్రతుకంతా

శ్రీ యేసు జన్మించగా - ఈ లోకానికే పండుగా



2. ఆజ్ఞతిక్రమమే పాపమాయెను -

నిత్య మరణానికి దారితీసేను

దేవుని కృపలో క్రీస్తునందు-

నిత్య జీవం అనుగ్రగించెను “2”

నశించినవారిని వెదకి రక్షించుటకు -

అరుణోదయ తారయై ఉదయించెను
విశ్వసించు ప్రతివాడు నిత్యజీవమును పొంద -

జీవహారమై దిగివచ్చెను

మరణపు ముళ్ళు విరిచేను పరలోకం చేర్చెను
శ్రీ యేసు దారికి చేరగా - విశ్వాసముంచి నీవు కొలువగా

Oka Subhavartha Song Lyrics | Rarandoi Janulara Song Lyrics | Latest Christmas Songs 2024 | Christmas Song Lyrics

రారండోయ్ జనులారా


ఒక శుభవార్త ఎలుగెత్తి చాటి గలమెత్తి పాడెదెనూ

శ్రీ యేసు కథలో సత్యము యెరిగి రక్షణ పొందుటకూ ||2||

రారండోయ్ జనులారా వినరండోయ్ మనసారా ||2||

|| ఒకశుభవార్త ||



1. ఆ తండ్రి ఇష్టం నెరవేర్చుటకు

ఆజ్ఞనూ మోసెలే ||2||

తన రాజ్యము విడిచి గర్భానానిలిచి
రిక్తుడై పుట్టెనులే ||2||

రారండోయ్ జనులారా వినరండోయ్ మనసారా||2||

|| ఒక శుభవార్త ||


2. ఇన్నాళ్ల కష్టం ఇకపై మనకు

కాస్తయినా రాదులే ||2||

తన ప్రేమతో పిలిచి ముద్దులతొ

ముంచి కన్నీరు తుడిచెనులే ||2||


రారండోయ్ జనులారా వినరండోయ్ మనసారా ||2||

|| ఒకశుభవార్త ||


3. ఆ పరలోకం మనకిచ్చుటకు

సిద్ధము చేసెలే ||2||

తన సర్వమునిచ్చి శుద్దులతొచేర్చి

జీవము ఇచ్చెనులే ||2||

రారండోయ్ జనులారా వినరండోయ్ మనసారా ||2||

|| ఒకశుభవార్త ||