నా యేసయ్య
పల్లవి : నా యేసయ్య నీ కృపను మరువలేనయ్య
నా యేసయ్య నీ దయలేనిదే బ్రతకలేనయ్య (2)
నీ నామ స్మరణలో దాగిన జయము
నీ వాక్య ధ్యానములో పొందిన బలము (2)
తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించేద (2)
హా... ఆహా... హల్లెలూయ
హో... ఓహో... హోసన్నా (2) || నా యేసయ్య ||
1. నా గుమ్మముల గడియలు బలపరచితివి
నీ చిత్తములో ఆడుగులు స్థిరపరచితివి (2)
నా సరిహద్దులలో నెమ్మదిని కలిగించి
నిన్ను వెంబడించే భాగ్యమునిచ్చితివి
హా... ఆహా... హల్లెలూయ
హో... ఓహో... హోసన్నా (2)
|| నా యేసయ్య ||
2. నీ వాగ్ధనములెన్నో నెరవేర్చితివి
నీ రెక్కల నీడలో నను దాచితివి (2)
నా భయభీతులలో నీ వాక్కును పంపించి
నిన్నే సేవించే గొప్ప భాగ్యమునిచ్చితివి
హా... ఆహా... హల్లెలూయ
హో... ఓహో... హోసన్నా (2)
|| నా యేసయ్య ||
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.