ఆశీర్వాదపు జల్లులు కురిసే కాలమిదియేగా
ఆత్మ దేవుడు గాలై వీచగా వర్షమై కురియునే "2"
ఉన్నతస్థలి నుండి నీపై ఆత్మను కురిపించున్
ఎండియున్న నిన్ను యేసు మరల బ్రతికించున్ "2"
మీ దుఃఖం సంతోషముగా మారే సమయమిది
మీ కలత కష్టం సంపూర్ణముగా తీరే తరుణమిది "2"
1) నీ ముందును నీ వెనుక దీవెన కురిపించున్
వాడియున్న నీ బ్రతుకు ఫలములతో నింపున్ "2"
బీడుగా ఉన్న నీ నేలను ఫలభరితము చేయున్
నీ చేతుల పనియంతటిలో ఆశీర్వాదమునిచ్చున్ "2"
|| మీ దుఃఖం ||
2) అరణ్యము పొలమువలె మారే సమయమిది
ఎడారిలో సెలయేరు ప్రవహించే తరుణమిది "2"
స్వప్నములో దర్శనములలో యేసే కలుసుకొని
దీర్ఘదర్శిగా నిన్ను మార్చి తానే వ్యక్తమగున్ "2"
|| మీ దుఃఖం ||
మహావర్షము ఒకటి కురియున్
మన దేశము పైన కురియున్ "2"
ఆత్మదేవుడు వర్షమై కురియునే
మహావర్షము ఒకటి కురియున్
మన దేశము పైన కురియున్
ఆత్మదేవుడు వర్షమై కురియునే "2"
ఆశీర్వాదపు వర్షమై కురియు
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.