Pages - Menu

Pages

Saturday, December 14, 2024

CHRISTMAS SUBHAVELALO-2 Song Lyrics|JK Christopher |Suresh Nittala |Sharon Sisters |New Telugu Christmas Song 2024


క్రిస్మస్ శుభవేళలో - 2


క్రిస్మస్ శుభవేళలో - మన
అందరి హృదయాలలో

ఆనందమానందమే - మనసంతా సంతోషమే-2

"స్తుతియించి  ఆరాదిద్దాం  - ఆ ప్రభుని 

ఘనపరచి   కీర్తించుదాం

రక్షకుడు పుట్టాడని - మనకు రక్షణ తెచ్చాడని "



1. దావీదు  పురమందు  రక్షకుడు
మన కొరకై  జన్మించాడు

దేవాధిదేవుని కుమారుడు రిక్తునిగా భువికొచ్చాడు  -2

ఆ ప్రభువే నరుడాయెను - లోకమును  ప్రేమించెను

మన పాపము తొలగించెను - పరిశుథ్థులుగా చేసెను-2

   ||స్తుతియించి||



2. సర్వోన్నతమైన స్థలములలో  - దేవునికే మహిమ

ఆనందమే ఆశ్చర్యమే  -  సంతోషం  సమాధానమే -2

దూతాళి  స్త్రోత్రించిరి -  కాపరులు చాటించిరి

ప్రభుయేసు  పుట్టాడని - మనకు తోడై ఉంటాడని-2

  ||స్తుతియించి||
                      

                           
3. వింతైన తార  వెలసిందని - ఙ్ఞానులు కనుగొంటిరి

ఆ తార వెంబడి వారొచ్చిరి - ప్రభుయేసుని దర్శించిరి-2

రాజులకే  రాజని - ప్రభువులకే ప్రభువని

కానుకలు అర్పించిరి - వినమ్రతతో  పూజించిరి-2

      ||స్తుతియించి||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.