మా క్షేమాధారం
నీవే యేసయ్యా
పల్లవి: మా క్షేమాధారం నీవే యేసయ్యా
కృపా సంపద నీవే మాకయ్యా
యెహోవా షమ్మా
యెహోవా షాలోమ్
యెహోవా నిస్సీ
యెహోవా రప్ఫా
1. మూయబడిన ద్వారాలన్ని తెరచుచున్నవాడా
ఓటమి అంచులో ఉన్నవారికి జయమునిచ్చువాడా
పనికిరాని ఈ తుమ్మ చెట్టును
మందసముగా చేయుచున్నవాడా
యెహోవా షమ్మా.......
2. చీకిపోయిన మొద్దును చిగురింపచేయువాడా
శపితమైన అంజూరముకు పండ్లనిచ్చువాడా
అవిసిపోయిన గుండెను మంచువలే
వాక్యముతో తడుపుచున్నవాడా (ఆదరించువాడా)
యెహోవా షమ్మా.......
3. లోయలోవున్న వారిని శిఖరమున నిలుపువాడా
లేమిలో ఉన్న వారికి సమృద్ధినిచ్చువాడా
శ్రేష్టమైన గోధుమలతో తృప్తిపరచి
బలాడ్యునిగా చేయుచున్నవాడా
యెహోవా షమ్మా...
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.