దేవా జ్ఞానమునిమ్ము
దేవా జ్ఞానమునిమ్ము
తెలివి వివేకము నిమ్ము
ఆలోచనా బలమునిమ్ము
నీ యెడల భయభక్తులనిమ్ము
1. అంధకారము ఆవరించగా
నీ వెలుగులో నడిపించుము దేవా
అపవాది అణచివేయగా
నీ బలముతో నిలబెట్టుము దేవా
కొరతలలో సమృద్ధి నీవై
రోగములో స్వస్థత నీవై
బాధలలో ఓదార్పువై
నిత్యము నను నడిపించు యెహోవా
2. యవ్వన కాలమున కాడి మోయను
ఆలోచన చెప్పుము ఓ తండ్రి
మార్గము తప్పి నడచు వేళ
భయభక్తులు నేర్పుము ఓ తండ్రి
మార్గములో కాపరివై
బలహీనతలో సామర్థ్యమువై
యుద్ధములోన ఖడ్గము నీవై
కడవరకు నా తోడై ఉండుమా
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.