కవుల కలములో రానిది
కవుల కలములో రానిది.. పాండిత్యంలో లేనిది..
జ్ఞానుల జ్ఞానానికి అందనిది నీ జీవిత చరిత్ర
మనిషి నీ చరిత్ర..మనిషి నీ చరిత్ర "కవుల"
1.సూర్య చంద్ర నక్షత్రములు నీ కొరకే కాదా..
సృష్టిలో నీకంటే గొప్పదేది ఉన్నదా..? "2"
నీవు దేవుని కుమారుడవు కులమతాల కతీతుడవు"2"
వెలుగించు మనోనేత్రము తొలగించుకో పాపము"2"
2.కప్పకంటే నీ జీవితము గొప్పదే కాదా..
కోతి నుండి నువు పుట్టావని తప్పు చెప్పలేదా..?"2"
నీ దేహం దేవాలయము దేవునికది మందిరము"2"
పాడు చేసుకుంటే దానిని తిరిగి కట్టలేము"2"
3.క్రీస్తు యేసు మరణించినది నికొరకే కాదా
పరమునకు మార్గము నేనని ప్రభువు చెప్పలేదా..?"2"
నమ్మితే యేసుక్రీస్తు ని ఉందువులే పరలోకంలో"2"
ఇదే నీకు రక్షణ దినము ఇది దేవుని సందేశము"2"
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.